చిత్రం: దొంగ (1985)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి:
తప్పనకా ఒప్పనకా.. తాకాలని ఉంది బుగ్గ..తాకాలని ఉంది రేపనకా మాపనకా.. పెట్టాలని ఉంది ముద్దు..పెట్టాలని ఉంది వాయిదాలు వేస్తుంటే.. వయసాగదే వాయిదాలు వేస్తుంటే.. వయసాగదే వాటేసు కున్నదాక మనసాగదే వాటేసు కున్నదాక మనసాగదే కాదనకా లేదనకా.. ఇవ్వాలని ఉంది మనసు.. ఇవ్వాలని ఉంది రేయనకా పగలనకా.. కలవాలని ఉంది నిన్నే కలవాలని ఉందీ వాయిదాలు వేస్తెనే.. వయసందము వాయిదాలు వేస్తెనే.. వయసందము వాటేసు కున్ననాడే.. వలపందము వాటేసు కున్ననాడే.. వలపందము చరణం: 1
సంపంగి పూసే వేళ.. నీ చెంప తాకే వేళ నీ వొంపు సొంపు నాకే ఇస్తావా నీ మంచు తగిలే వేళ.. నా మల్లె తడిసే వేళ నా సిగ్గు సింగారాలు దోస్తావా.. వయ్యారం కౌగిట్లోనే ఓడిస్తా.. సందిట్లో పందాలెన్నో.. గెలిపిస్తా గెలిపించవా.. చలిపెంచవా.. వలపించవా..ఒడిపంచవా నా లేడి లేచాక పరుగాగదూ నా లేడి లేచాక పరుగాగదూ నీ కోడి కూస్తుంటే పరువాగదూ నీ కోడి కూస్తుంటే పరువాగదూ తప్పనకా ఒప్పనకా..తాకాలని ఉంది బుగ్గ..తాకాలని ఉంది హోయ్.. రేయనకా పగలనకా.. కలవాలని ఉంది నిన్ను కలవాలని ఉందీ చరణం: 2
నీ చేయి తాకే వేళ..నా చీర అలిగే వేళ నా కట్టు బొట్టు అన్ని చూస్తావా..ఆ సోకంత బలిసే వేళ..రైకంత బిగిసే వేళ నా వేడి వాడి అన్ని చూస్తావా..ఆ సరికొత్తా ఇరకాటంలో పెట్టేస్తా..ఆ హోయ్..సరిహద్దే కౌగిట్లో కొట్టేస్తా..ఆ కౌవ్వించవా..కసిపెంచవా..పొగమంచులో..పగపెంచవా నీ గాలి వీచాక..మెరుపాగదు.. నీ గాలి వీచాక..మెరుపాగదు నా జోలి కొచ్చాక చినుకాగదూ.. నా జోలి కొచ్చాక చినుకాగదూ హోయ్..కాదనకా లేదనకా..ఇవ్వాలని ఉంది మనసు..ఇవ్వాలని ఉంది రేపనకా మాపనకా..పెట్టాలని ఉంది ముద్దు..పెట్టాలని ఉంది వాయిదాలు వేస్తెనే.. వయసందము వాయిదాలు వేస్తెనే.. వయసందము వాటేసు కున్నదాక మనసాగదే వాటేసు కున్నదాక మనసాగదే