చిత్రం: దొంగ (1985)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
సంగీతం: చక్రవర్తి
అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా... అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా.... కవ్వించే నీ కళ్ళు.. నువ్విచ్చే కౌగిళ్ళు... నూరేళ్ళు నావేనులే.. ఏ ఏ ఏ.. అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా.... తెల్ల చీర ఇచ్చుకో మల్లెపూల వేళలో సన్నకాటుకిచ్చుకో సందె చీకటేళలో కదలి వచ్చే నీలో.. కడలి పొంగులు చూశా కనుల నీడలలోనే.. కవితలెన్నో రాశా.. ఆహాహా కొత్త మోజుల.. మత్తు గాలికి.. సొగసు ఊపిరి.. పోసుకున్నది రాగాలెన్నో నీలో రేగే వేళా... అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా.... కొమ్మ రెమ్మ సందుల్లో మావిళ్ళ విందులో కోకిలమ్మ వీధుల్లో రాగాల చిందులు రామచిలకలు తెచ్చే చిగురు లేఖలు చూశా చిగురు వేసిన ప్రేమా.. నీకు కానుక చేశా మండు వేసవి.. మల్లెలావిరి.. పండు వెన్నెల.. పడుచు ఊపిరి.. నీలో నాలో ఊయ్యాలూగే వేళా.. అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా... కవ్వించే నీ కళ్ళు.. నువ్విచ్చే కౌగిళ్ళు నూరేళ్ళు నావేనులే.. ఏ ఏ ఏ.. అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి