Manchi Manasulu(1962) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Manchi Manasulu(1962) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఫిబ్రవరి 2022, సోమవారం

Manchi Manasulu : Emandoy Srivaru Song Lyrics (ఏమండోయ్ శ్రీవారు)

చిత్రం: మంచి మనసులు (1962)

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



పల్లవి :

ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ఏదీకాని వేళ

ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ఏదీకాని వేళ ఏమండోయ్...

చరణం : 1 పసివాని చూచుటకీ తొందర మైమరచి ముద్దాడి లాలింతురా ఉళళళ హాయి ఉళళళ హాయి ఊహుహు ఊహుహు...॥ శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో ఇచ్చేందుకేముంది మీ దగ్గర

ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ఏదీకాని వేళ ఏమండోయ్...

చరణం : 2 అబ్బాయి పోలిక ఈ తండ్రిదా అపురూపమైన ఆ తల్లిదా ఓహోహో॥ అయ్యగారి అందాలు రానిచ్చినా ఈ బుద్ధి రానీకు భగవంతుడా॥

ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ఏదీకాని వేళ ఏమండోయ్...


చరణం : 3 ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే అయ్యో పాపం ప్రియమైన మా ఇల్లు విడినాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే కపటాలు మానేసి నా మదిలోన (2) కాపురము చేయండి కలకాలము॥

ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ఏదీకాని వేళ ఏమండోయ్..

18, జనవరి 2022, మంగళవారం

Manchi Manasulu : Silalapai Silpalu Chekkinaru Song Lyrics (శిలలపై శిల్పాలు చెక్కినారు)

చిత్రం: మంచి మనసులు (1962)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల

సంగీతం: కె. వి. మహదేవన్




అహో ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయా విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు... శిలలపై శిల్పాలు చెక్కినారు... కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒక వైపు ఉర్రూతలూపు కవనాలు ఒక ప్రక్క ఉరికించు యుద్ధభేరీలు ఒక చెంప శృంగారమొలుకు నాట్యాలు నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసికొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు... శిలలపై శిల్పాలు చెక్కినారు... ఏకశిల రథముపై లోకేశు వడిలోన ఓరచూపులదేవి ఊరేగి రాగా ఏకశిల రథముపై లోకేశు వడిలోన ఓరచూపులదేవి ఊరేగి రాగా రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిసా స్వరములే పాడగా... కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ... శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు... శిలలపై శిల్పాలు చెక్కినారు... రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు మారినా గాడ్పులే వీచినా... మనుజులే దనుజులై మట్టిపాల్జేసినా ఆ... ఆ... ఆ... ఆ... చెదరనీ కదలనీ శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచివుందువు చెలీ. నిజము నా జాబిలీ

15, జనవరి 2022, శనివారం

Manchi Manasulu : Mama Maama Mama Song Lyrics (మావా మావా మావా)

చిత్రం: మంచి మనసులు (1962)

రచన: కొసరాజు

గానం: ఘంటసాల,జమున రాణి

సంగీతం: కె. వి. మహదేవన్


మావోయ్..!!! మావా మావా మావా.. మావా మావా మావా.. ఏమే ఏమే భామా..? ఏమే ఏమే భామా..??? నులక మంచం టైటు చేశా… రొయ్య పొట్టు చారు చేశా నులకమంచం టైటు చేశా… రొయ్య పొట్టు చారు చేశా రైటు కొట్టి లైటు తీద్దామా… మావా మావా మావా…ఆహ్హ్ ఆహ్హ మావా మావా మావా…!!! పేసు చూస్తే చాప కేసు… నులక మంచం సుద్ద వేస్టూ పేసు చూస్తే చాప కేసు… నులక మంచం సుద్ద వేస్టూ చారు తాగి చెక్కేయ్ భామా… మావా… మావా మావా మావా ఏమే ఏమే భామా మావా మావా మావా ఏమే ఏమే భామా చిలక రంగు పలక మారుతున్నదీ… పిల్లో కులుకు చూసి… గుబులు తీర్చమన్నదీ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్… కోరికొచ్చి కోక మీద పడ్డది… గురుడా..! కొంగు పట్టి కస్సు చూడమన్నదీ… ఓయ్ యస్సు పాప… మిస్సు పాప… కుట్టినాదే కొంటే చేపా… పెట్టెయ్ నా కుచ్చుల టోపా మావా మావా మావా… ఏమే ఏమే భామా…ఏయ్ మావా.. మావా మావా… దామ్మా దామ్మా దామ్మా బెండకాయ, బ్రహ్మచారి ముదిరితే… మగడా..! పనికిరావు ముందు చూపు చూసుకో… ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్…ఆఆ సామెతల్ని పోగు చెయ్యకే సుందరీ పడక పంచుకుంటె మంచిదంట జాంగిరీ… యెస్సు బాసు కిస్సు బాసు అదరగొట్టేయ్ బిగ్గు బాసు ఇచ్చేస్కో వలపుల డోసూ… మావా మావా మావా… దామ్మా దామ్మా దామ్మా నులక మంచం టైటు చేశా… రొయ్య పొట్టు చారు చేశా నులకమంచం టైటు చేసి … రొయ్య పొట్టు చారు చేసి రైటు కొట్టి లైటు తీద్దామా… ఆ ఆ ఓయ్..! మావా మావా మావా… దామ్మా దామ్మా దామ్మా… మావా మావా మావా… మావోయ్ అరె..! దామ్మా దామ్మా దామ్మా… బామోయ్

Manchi Manasulu : Nannu Vadhali Neevu Polevule Song Lyrics (నన్ను వదలి నీవు పోలేవులే)

చిత్రం: మంచి మనసులు (1962)

రచన: దాశరథి

గానం: ఘంటసాల,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్




నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే..ఏ..ఏ.. పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ... తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ.. నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ.. నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే చరణం 1: నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ.. తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ.. నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే చరణం 2: సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ... సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ... రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి పొంగిపోవు శుభదినము రానున్నదిలే ఓ… నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే చరణం 3: తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా... నీ మేని హొయలు నీలోని వగలు...నాలోన గిలిగింతలిడగా హృదయాలు కలసి ఉయ్యాలలూగి...ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ.. పైపైకి సాగే మేఘాలదాటి..కనరాని లోకాలు కనగా ఆహా ఓహో ఉహు ఆ…ఓ… నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే