18, జనవరి 2022, మంగళవారం

Manchi Manasulu : Silalapai Silpalu Chekkinaru Song Lyrics (శిలలపై శిల్పాలు చెక్కినారు)

చిత్రం: మంచి మనసులు (1962)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల

సంగీతం: కె. వి. మహదేవన్




అహో ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయా విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు... శిలలపై శిల్పాలు చెక్కినారు... కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒక వైపు ఉర్రూతలూపు కవనాలు ఒక ప్రక్క ఉరికించు యుద్ధభేరీలు ఒక చెంప శృంగారమొలుకు నాట్యాలు నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసికొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు... శిలలపై శిల్పాలు చెక్కినారు... ఏకశిల రథముపై లోకేశు వడిలోన ఓరచూపులదేవి ఊరేగి రాగా ఏకశిల రథముపై లోకేశు వడిలోన ఓరచూపులదేవి ఊరేగి రాగా రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిసా స్వరములే పాడగా... కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ... శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు... శిలలపై శిల్పాలు చెక్కినారు... రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు మారినా గాడ్పులే వీచినా... మనుజులే దనుజులై మట్టిపాల్జేసినా ఆ... ఆ... ఆ... ఆ... చెదరనీ కదలనీ శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచివుందువు చెలీ. నిజము నా జాబిలీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి