Murari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Murari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2022, శుక్రవారం

Murari : Bangaru Kalla Song Lyrics (బంగారు కళ్ళ బుచ్చమ్మొ)

 చిత్రం : మురారి (2001)

గానం: ఉదిత్ నారాయణ్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : మణి శర్మ




బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ సందె పొద్దుల్లొ ముద్దబంతల్లె ఎంత ముద్దుగున్నావే వెండి మువ్వల్లె ఘల్లుమంటుంటె గుండె జిల్లుమన్నాదే బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ నీలొ చింత చిగురు పులుపున్నదె బుల్ బుల్ పిట్ట మల్ మల్ పట్ట కవ్వంలాగ చిలికె కులుకున్నదె తలుకుల గుట్ట మెరుపుల తట్ట ఏ నీలొ చింత చిగురు పులుపున్నదె కవ్వంలాగ చిలికె కులుకున్నదె కొంటె మాట వెనక చనువున్నదె తెలుసుకుంటె మనసు పిలుపున్నదె కళ్ళు మూసి చీకటి ఉందంటె వెన్నెల నవ్వుకుంటుందే ముసుగె లేకుంటె మనసె జగాన వెలుగై నిలిచివుంటుందే బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ నిన్న నేడు రేపు ఒక నిచ్చెన సిరి సిరి మువ్వ గడసరి గువ్వ మనకు మనకు చెలిమె ఒక వంతెన సొగసుల గువ్వ ముసి ముసి నవ్వ హె నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమె ఒక వంతెన ఎవరికి వారై ఉంటె ఏముందమ్మ మురళి కాని వెదురై పోద జన్మ చేయి చేయి కలిపె కోసమె హ్రుదయం ఇచ్చాడమ్మాయీ జారిపోయాక తిరిగి రాదమ్మొ కాలం మాయమరాఠీ బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ సందె పొద్దుల్లొ ముద్దబంతల్లె ఎంత ముద్దుగున్నావే వెండి మువ్వల్లె ఘల్లుమంటుంటె గుండె జిల్లుమన్నాదే బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ

1, ఆగస్టు 2021, ఆదివారం

Murari : Alanati Ramachandrudi Song Lyrics (అలనాటి రామచంద్రుడి)

చిత్రం: మురారి(2001)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: జిక్కి, సునీత , సంధ్య



అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగాలేవని వెలవెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతు పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలకల జంటని పదిమంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయ్యండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగాలేవని వెలవెల బోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగాలేవని వెలవెల బోవమ్మా

31, జులై 2021, శనివారం

Murari : Bhama Bhama Song Lyrics (బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ)

చిత్రం: మురారి

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్


బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా యమకారంగా మమకారంగా నిను చుట్టెస్తా అధికారంగా గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ అబ్బోసీ సొగసొగ్గేసీ మహచెలరేగావే లగిలేసీ నినుచూసీ తెగ సిగ్గేసీ తలవంచేసా మనసిచ్చేసీ చుట్టేసీ పొగ పెట్టేసీ నను లాగేసావే ముగ్గేసీ వొట్టేసీ జతకట్టేసీ వగలిస్తానయ్యా వలిచేసీ ఓస్సోసీ మహముద్దేసీ మతిచెడగొట్టావే రాకాసి దోచేసీ మగమందేసీ నను కపాడయ్యా దయచేసీ

బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ హోయ్ హోయ్ 

అరె బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ముద్దు కావాలీ  హోయ్ హోయ్ హత్తు కోవాలీ  హాయ్ హాయ్ సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ

బామా బామా డడ్డడా డండడార డాడా అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ అరె బామా బామా డడ్డడా డండ డడ డండ డడ డండ డండడా

4, జూన్ 2021, శుక్రవారం

Murari : Cheppamma Cheppamma song Lyrics (చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం )

 చిత్రం: మురారి
సంగీతం: మణి శర్మ
గానం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం  తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం  నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది  ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ చరణం 1  వెంట తరుముతునావే ఎంటి ఎంత తప్పుకున్నా  కంటికెదురు పడతావే ఎంటి యెటు చూసిన  చెంప గిల్లి పోతవేంటి గాలి వేలితోన  అంత గొడవ పెడతావే ఎంటి నిద్దరోతు ఉన్నా  అసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునా  ఒంటిగా ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైన  ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ  నువ్వేం చేసినా బగుంటుందని నిజం నీకెలా చెప్పనూ  చరణం 2  నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచటైన  యేడిపించ బుద్దవుతుంది యెట్టాగైన  ముద్దుగానె ఉంటావేమొ మూతి ముడుచుకొన్నా  కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా  నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా  లేని పోని ఉక్రోషంతొ ఉడుకెత్తనా  ఇదేం చూడక మహా boreగా ఏటో నువ్వు చూస్తూ ఉన్నా  అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రామా  చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ I love you చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం

Murari : Ekkada Ekkada Song Lyrics (ఎక్కడ ఎక్కడ ఉందో తారకా)

 

చిత్రం: మురారి
సంగీతం: మణి శర్మ
గానం: S.P.చరణ్, హరిణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


ఎక్కడ ఎక్కడ ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ ఏ వూరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఎక్కడ ఎక్కడ ఉందో తారకా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా కులుకులో ఆ మెలికలూ మేఘాలలో మెరుపులూ పలుకులూ ఆ పెదవులూ మన తెలుగు రాచిలకలూ పదునులూ ఆ చూపులూ చురుకైన సురకత్తులూ పరుగులూ ఆ అడుగులూ గోదారిలో వరదలూ నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురీ నా కళ్ళలో కలల పందిరీ అల్లేయకోయి మహాపోకిరీ మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ సిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ మెరుపుని తొలిచినుకునీ కలగలిపి చూడాలనీ ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ ఎన్నాళ్ళిలా తనోస్తాడనీ చూడాలటా ప్రతీ దారినీ ఏ తోటలో తనుందోననీ ఎటు పంపనూ నా మనసునీ ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా ఎక్కడ ఎక్కడ ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఏ వూరే అందమా ఆచూకీ అందుమా అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక