చిత్రం: పెళ్లి (1997)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి: ఓ...యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరిన మైనా నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిల్లానా నీ పేరు ప్రేమ ఔనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ ఔనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ...యవ్వన వీణ పువ్వుల వాన చరణం:1 నువ్వంటు పుట్టినట్టు నా కొరకు ఆచూకి అందలేదు ఇంతవరకు వచ్చింది గాని ఈడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు చూసాక ఒక్కసారి ఇంత వెలుగు నా వంక రాను అంది కంటి కునుకు ఈ అల్లరి ఈ గారడి నీ లీల అనుకోనా నీ పేరు ప్రేమ ఔనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ...యవ్వన వీణ పువ్వుల వాన చరణం:2 ఏ పూలతీగ కాస్త ఊగుతున్నా నీ లేత నడుమే అనుకున్నా ఏ గువ్వ కిలకిల వినబడినా నీ నవ్వులేనని వెళుతున్నా మేఘాల మెరుపులు కనపడినా ఏ వాగు పరుగులు ఎదురైనా ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా నీ పేరు ప్రేమ ఔనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ...యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరిన మైనా నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిల్లానా నీ పేరు ప్రేమ ఔనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ ఔనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా