2, జులై 2021, శుక్రవారం

Pelli : Paita Kongu Entho Manchidi Song Lyrics (పైట కొంగు ఎంతో మంచిది)

చిత్రం:పెళ్లి(1997)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


పల్లవి:

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది

పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదింక ఈడు

నచ్చజెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు

కాసుకో అమ్మడు... కొంటె దూకుడు

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది

పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది


చరణం:1

సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని

ఎగబడి రమ్మని పిలువకు వయసుని

సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని

ఎగబడి రమ్మని పిలువకు వయసుని

అదిరిపడే పెదవులలో అనుమతినే చదవని

బిడియపడే మనసు కదా అడగకు పైపదమని

బెదురు ఎంత సేపని ... ఎవరున్నారని

అదను చూసి రమ్మని అందాలయ్య అందాన్ని


పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది

హోయ్...పాడు సిగ్గు ఎంతో చెడ్డది 

ఆపుతున్నది


చరణం:2

చలి చలిగాలిలో చెమటలు ఏంటట

వలపుల లీలలో అది ఒక ముచ్చట

చలి చలిగాలిలో చెమటలు ఏంటట

వలపుల లీలలో అది ఒక ముచ్చట

ఎదురు పడే మధనుడితో వరస ఎలా కలుపుట

తెరలు వీడే తరుణంలో తెలియనిదేమున్నదట

మాయదారి ప్రేమలో ఏం చెయ్యాలట

మోయలేని హాయిలో ఒళ్లో కొస్తే చాలంట

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది

పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదింక ఈడు

నచ్చజెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జత కూడు

కాసుకో అమ్మడు... కొంటె దూకుడు


పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది

పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి