Sri Venkateswara Mahatyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sri Venkateswara Mahatyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జనవరి 2022, శుక్రవారం

Sri Venkateswara Mahatyam : Sesha Saila Vaasa Song Lyrics (శేషశైలావాస)

చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల
సంగీతం : పెండ్యాల



శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ..  చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

Sri Venkateswara Mahatyam : Nanda Gopala Song Lyrics (గోపాలా.. ఆ.. నందగోపాలా)

చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : శాంత కుమారి

పల్లవి : గోపాలా.. ఆ.. నందగోపాలా.. ఆ.. ఆ.. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ యెదురు చూతురా గోపాలా ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా.. చరణం 1 : వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా ఆ.. ఆ.. ఆ.. ఆ.. వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా వేచి వేచి యీ వెన్నముద్దవలె కరగిపోయెరా.. నా బ్రతుకు కరగిపోయెరా.. నా బ్రతుకు ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా.. చరణం 2 : వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట.. ఆ.. ఆ.. ఆ.. ఆ... వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా యీ తల్లి హృదయము ఓర్వలేదయా.. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా..