21, జనవరి 2022, శుక్రవారం

Sri Venkateswara Mahatyam : Nanda Gopala Song Lyrics (గోపాలా.. ఆ.. నందగోపాలా)

చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : శాంత కుమారి

పల్లవి : గోపాలా.. ఆ.. నందగోపాలా.. ఆ.. ఆ.. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ యెదురు చూతురా గోపాలా ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా.. చరణం 1 : వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా ఆ.. ఆ.. ఆ.. ఆ.. వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా వేచి వేచి యీ వెన్నముద్దవలె కరగిపోయెరా.. నా బ్రతుకు కరగిపోయెరా.. నా బ్రతుకు ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా.. చరణం 2 : వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట.. ఆ.. ఆ.. ఆ.. ఆ... వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా యీ తల్లి హృదయము ఓర్వలేదయా.. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా.. గోపాలా.. నంద గోపాలా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి