Marana Mrudangam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Marana Mrudangam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, అక్టోబర్ 2024, శుక్రవారం

Marana Mrudangam : Godave Godavamma Song Lyrics (గొడవే గొడవమ్మ...)

చిత్రం: మరణ మృదంగం (1988)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ...
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే...
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే...
తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ
చరణం 1:
మొదటే చలి గాలి సలహాలు వింటే
ముసిరే మోహాలు దాహాలు పెంచే
కసిగా నీ చూపు నా దుంప తెంచే
అసలే నీ వంపు నా కొంప ముంచే ముదిరే వలుపులో నిదురే సేవంట
కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటా
బెదిరే కళ్ళలో కధలే నే వింటా
అదిరే గుండెలో శృతులే ముద్దంటా
దోబోచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకోలేని బంధమొకటి అంది పదుకో రగిలే పరువం సిగలో విరిసే మరువం
పగలే పెరిగే బిడియం కలిపి చెరిగే ప్రణయం
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసుఉలికి పడుతు
గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ
చరణం 2:
ఇప్పుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు
పడితే తెలిసింది తొలిప్రేమ కాటు
కునుకే లేకున్నా ఈ నైట్ బీటు
ఎప్పుడో మార్చింది నా హార్ట్ బీటు పిలిచే వయస్సులతో జరిగే పేరంటం
మొలిచే సొగసులతో పెరిగే ఆరాటం
చలికే వొళ్ళంతా పలికే సంగీతం
సరదా పొద్దులోకరిగే సాయంత్రం
నీ ఎడారి నిండా ఉదక మండలాలు
నీటి ధార దాటే మౌన పంజరాలు
తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం
జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు
గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ

7, ఏప్రిల్ 2022, గురువారం

Marana Mrudangam : Kottandi Tittandi Song Lyrics (కొట్టండి తిట్టండి)

చిత్రం: మరణ మృదంగం (1988)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా... మహా కసి గున్నది భలే రుచిగుంటది ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దల్లె
తడిపేసే కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా...
చరణం 1:
కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా...
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా ఎద ఎద కలిపేది ప్రేమా....
శృంగార వీధిల్లోనా షికారు చేసి
ఊరోళ్ల నోళ్ళలోనా పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారు కెక్కించి
మాటిస్తే వినుకోదు
లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు
ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలుపు చిలిపి పిలుపు కొట్టండి కొట్టండి
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
చరణం 2:
మళ్లీ మళ్లీ అంటుంది మారాముగా వొళ్ళోకొచ్చి పాపంటి ప్రేమా..
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా చెల్లించేయ్ ఆ కాస్త ప్రేమా.. మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలు ఎన్నో మలాము వేసి
వయస్సుని వసంత మాడించే
మనస్సులో తుళ్ళింత పుట్టించే
చూపుల్తో శ్రుతి కాదు
మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు
ముట్టందే చలి పోదు
ఈ మనసు మధన తనువు తపన కొట్టండి కొట్టండి
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా... మహా కసి గున్నది భలే రుచిగుంటది ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే
తడిపేసే కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..



30, మే 2021, ఆదివారం

Marana mrudangam : Sarigama padanisa (సరిగమ పదనిస రసనసా)

చిత్రం: మరణ మృదంగం (1988)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా విచ్చుకున్న ముద్దబంతి కథా
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుసా
చరణం 1 :

రెండు హృదయాల పిట్టపోరూ తీరనంటుంది ఎందుకో
దొంగ యోగాల కొంగగారూ గాలమేసేది ఎందుకో
చేతికందాక జాబిలీ చుక్కతో నాకు ఏం పనీ
తట్టుకున్నాక కౌగిళీ ఏమి కావాలొ చెప్పనీ
కస్సుమన్న దాని సోకు కసిగా ఉంటుందీ
తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమంటుందీ
సిగ్గో చీనీలపండు బుగ్గో బత్తాయిపండు
అల్లో నేరేడుపండు నాదీ
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా విచ్చుకున్న ముద్దబంతి కథా
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుసా

చరణం 2 :

వయసు వడగళ్ళ వాన నీరూ వంటపట్టింది ఎందుకో
నన్ను దులిపేసి వలపు గాలీ నిన్ను తాకింది తట్టుకో
లేత అందాల దోపిడీ ఇప్పుడే కాస్త ఆపనీ
ఆపినా ఆగి చావదూ అందచందాల ఆ పనీ
ఇంతదాక వచ్చినాక ఇంకేమౌతుందీ
లబ్జు లబ్జు మోజు మీదా లంకే అంటోందీ
అబ్బొ నా బాయ్ ఫ్రెండు ముద్దిస్తె నోరు పండు
వాటేస్తె ఒళ్ళుమండునమ్మా
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా విచ్చుకున్న ముద్దబంతి కథా
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా ఇది కనివిని ఎరుగని గుసగుసా

Marana Mrudangam : Karigipoyani karpura veenalaa song lyrics (కరిగిపోయాను కర్పూర వీణలా)

చిత్రం: మరణ మృదంగం (1988)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల


పల్లవి:

Female కరిగిపోయాను కర్పూర వీణలా
                కలిసిపోయాను నీ వంశధారలా
          నా గుట్టు జారిపోతున్న నీ పట్టు చిక్కిపోతున్నా
Male :   నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా 
              కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
             కలిసిపోయాక ఈ రెండు కన్నులా

చరణం 1 :

Female మనసుపడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా
Male : పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా
Female ఏ ఆశలో ఒకే ధ్యాసగా
Male : ఏ ఊసులో ఇలా బాసగా
            అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా Female : కరిగిపోయాను కర్పూర వీణలా
Male : కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
Female: నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
Male: నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
Female: కరిగిపోయాను కర్పూర వీణలా
Male :కురిసిపోయింది ఓ సందె వెన్నెలా

చరణం 2 :

Male : అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా
Female: జతలుకలిసి మనమొంటిగా ఏమైనా సరిగరిసా
Male :   ఏ కోరికో శృతే మించగా
Female: ఈ ప్రేమలో ఇలా ఉంచగా అధరాలెందుకో అందాలలో నీ
               ప్రేమలేఖలే లిఖించగా Male    కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
Female: కలిసిపోయాను నీ వంశధారలా
Male:  నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
Female: నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
Male : కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
Female: కలిసిపోయాను నీ వంశధారలా