చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.యస్.చిత్ర
పల్లవి :
Male: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి
Female: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
Male: మోవిని మగతావిని ముడివేయనీయవా
Female: కాదని అనలేనని గడి అయిన ఆగవా
Male: అదుపు పొదుపులేని ఆనందం కావాలి
Female: హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి
Male: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి
Female: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
చరణం : 1
Male: కాంక్షలో కైపునిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
Female: శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంచతో వేగు దేహం పరయాగవాటిక
Male: కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
Female: మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
Male: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి
Female:వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
చరణం : 2
Male: నిష్ఠగా నిన్నుకోరి నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
Female: నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెచ్చనా
Male: సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
Female: మదనమే అంతమయ్యే అమృతం అందుకో Male: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి
Female: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
Male: మోవిని మగతావిని ముడివేయనీయవా
Female: కాదని అనలేనని గడి అయిన ఆగవా
Male: అదుపు పొదుపులేని ఆనందం కావాలి
Female: హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి
Male: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి
Female: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి