1, జూన్ 2021, మంగళవారం

Kondaveeti Donga : Subhalekha Raasukunna song Lyrics (శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..)

చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయ రాజా

గీత రచయిత : వేటూరి సుందరరామ మూర్తి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్.చిత్ర


పల్లవి: 

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో.. అది మీకు పంపుకున్న అపుడే కలలో.. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో.. ఒత్తిడి వలపుల గంధమిస్తా.. పక్కలలో అతడు: శుభలేఖ అందుకున్నా కలయో నిజమో.. తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో.. శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో.. తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో చరణం 1: చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి?? కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి.. మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి.. మల్లెమబ్బు లాడెనేమో బాలనీలవేణికి మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు.. అతడు: గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు.. అంతేలే, కథ అంతేలే, అదంతేలే శుభలేఖ అందుకున్నా కలయో నిజమో.. తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో.. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో.. ఒత్తిడి వలపుల గంధమిస్తా.. పక్కలలో అతడు: శుభలేఖ అందుకున్నా కలయో నిజమో.. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో.. చరణం 2: హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి.. ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో.. రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో.. వేసవల్లె వేచివున్నా వేణుపూల తోటలో వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు.. ఒళ్ళో దాటి వెళ్ళ సాగేఎన్నో వాంఛలు.. అతడు: అంతేలే, కథ అంతేలే, అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో.. అది మీకు పంపుకున్న అపుడే కలలో.. అతడు: శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో.. శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి