President Gaari Pellam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
President Gaari Pellam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఫిబ్రవరి 2022, శనివారం

President Gari Pellam : Mandoori Aambotu Song Lyrics (మండూరి ఆంబోతు )

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం.ఎం.కీరవాణి




పల్లవి :

మండూరి ఆంబోతు ఏహేహే మందలోనే రంకేస్తే ఏహేహే 
ఏహేహే మండూరి ఆంబోతు ఏహేహే మందలోనే రంకేస్తే
ఏహేహే మండూరి ఆంబోతు ఏహేహే మందలోనే రంకేస్తే
అరేయ్ గుంటూరు గోంగూర తేనే అదిరింది
ఆంబూరు ఆవు పెయ్య మేన అదిరింది 
అరేయ్ గుంటూరు గోంగూర తేనే అదిరింది
ఆంబూరు ఆవు పెయ్య మేన అదిరింది 
హైసరాబన్నారో హద్దిరాంబన్నారో ముద్దలగుమ్మారో ముంగిట గొబ్బిళ్ళో
హైసరాబన్నారో హద్దిరాంబన్నారో ముద్దలగుమ్మారో ముంగిట గొబ్బిళ్ళో
ఏహేహే మండూరి ఆంబోతు ఏహేహే మందలోనే రంకేస్తే

చరణం : 1

వగలాడి వంకాయ కూర దాని నగలిదిగో నవనీత చోర
దీని సిగదరగ చిత్రాల సిలక దాని మొగుడెవరో మొగిలాకు మొలక
ఏడ ఎల్లా పూసా అది నల్ల పూసా
వాలు చూసాకే నీ వాటేశా
వద్దనే వద్దకొచ్చి పొద్దునే పెట్టె ముద్దు
సన్నదో సద్ది మూట
ఎన్నెల్లో చెంతకొచ్చి  ఎన్నెల్లో పూసగునుంచి పెట్టె ఎంకిపాట
ఏహేహే మండూరి ఆంబోతు ఏహేహే మందలోనే రంకేస్తే
ఏహేహే మండూరి ఆంబోతు ఏహేహే మందలోనే రంకేస్తే

చరణం : 2

చందనాల చెట్టు కాడా చందమామ గుట్టా కాడా 
అరేయ్ రరేయ్ చందనాల చెట్టు కాడా చందమామ గుట్టా కాడా 
అరేయ్ రరేయ్ చందనాల చెట్టు కాడా చందమామ గుట్టా కాడా 
సెంటుమల్లి పువ్వులాంటి గుంట పిచ్చి
జంట కొచ్చి మంట పెట్టి పోయింది గుండెలోన
దాని మట్టికిడసి మరి పట్టుకొనా
గిత్తల్లే  రంకెలేసి గిత్తల్లే చిందులేసి ఓడిస్తే పీకులాట
ఒళ్లంతా ఎండబెట్టి గుట్టంతా ఎండగట్టి ఆడించేస్తా గుమ్మలాట
ఏహేహే మండూరి ఆంబోతు ఏహేహే మందలోనే రంకేస్తే

కందిరీగ నడుము దాన ఎట్టా పోనిత్తురా
కాకరాల మొటిమ దాని ఎట్టా పోనిత్తురా
సందమామ మొకం దాని ఎట్టా పోనిత్తురా
నీలిమబ్బు కురులదాని ఎట్టా పోనిత్తురా
శనగ పూల రైక దాన్ని సేత్తా పట్టాలుగా
ఎనకముందు  కాలాలు ఎట్టా పోనిత్తురా
ఏహేహే మండూరి ఆంబోతు
ఓహ్హోహో మండూరి ఆంబోతు
ఏహేహే మండూరి ఆంబోతు 
ఓహ్హోహో మండూరి ఆంబోతు

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

President Gari Pellam : Paruvaala kodi Song Lyrics (పరువాల కోడి)

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి




పల్లవి :

పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
బలిసింది బాడి పొగరెక్కి ఉన్నదీ
నాటు దెబ్బ పడీతే...కోలాట కొట్టిస్తా
నీ ఆట పట్టిస్తా
రూటు మార్చికొడితే
శివ తాండవాల చిచ్చుపెట్టి తొడగొడతాలే బుడతా
పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
పసివాడి బాడి పదునెక్కి ఉన్నదీ
నాటు దెబ్బ పడీతే...కోలాట కొట్టిస్తా
నీ ఆట పట్టిస్తా
రూటు మార్చికొడితే
శివ తాండవాల చిచ్చుపెట్టి తొడగొడతాలే బుడతా

చరణం : 1

దెబ్బకు దెబ్బ తీసావంటె అదిరిపోతావులేవె బ్రతికిపోవే
యెత్తుకు యెత్తు వేసానంటె యెగిరిపోతావులేరా రసికవీరా
చెడిపోకు ముల్లు మీద ఆకుల్ల
పడి పోకు పల్లెటురి బైతుల్లా
నలిపేస్తా నాగమల్లి మొగ్గలా
దులిపేస్తా దుమ్ము నీకు మూతగా
నాకు తిక్క రేగితే నీ పీట లాగేస్తా సైఆటె ఆడేస్తా
టౌను పోసు కొడితే కొస రాజు పాట పాడి నిన్ను పదగుడతాలే మిడతా
పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
పసివాడి బాడి పదునెక్కి ఉన్నదీ

చరణం : 2

చింపాంజీల చిందేసావా చిరిగిపోతుంది కాని చిలిపి రాణీ
క్యాబ్రె పట్టు పట్టానంటె అదిరిపోతావు రాజ అడుసుకూజా
ఓ కాంతా నీకు వెన్ను పోటునీ
సమంత ఫాక్స్ నాకు సాటిలే
మువ్వలున్న ముద్ద పప్పు నీవులే
గజ్జలున్న గంగిరెద్దు కానులే
పిచ్చి కూత పెడితే..నీ పీట లేపేస్త నీ సీటు చించేస్తా
కొత్త ఊపుకెడితే కుదురైన పాత కూచిపూడి మొదలెడతాలె..బుడతా
పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
బలిసింది బాడి పొగరెక్కి ఉన్నదీ

3, ఫిబ్రవరి 2022, గురువారం

President Gari Pellam : Aa Oddu Ee Oddu Song Lyrics (ఆ ఒడ్డు ఈ ఒడ్డు)

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


పల్లవి :

ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు
ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా...
నీ బుగ్గ నా మొగ్గ నడిమధ్య ఎవరడ్డు
ఛీ పోలా తీపి కోపాలా.. ఛీ పోలా తీపి కోపాలా...
కాదన్న ముద్దియ్యీ కన్యామణి, సిగ్గన్న ముద్దే ఈ కాంతామణి
ఏమన్న అనకున్న రేపన్న మాపన్న
ఇద్దరికి తప్పుదులే ఈ కౌగిలి...
ఓయ్ ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా...
ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు
ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా...

చరణం : 1

వంగతోట కాడ నువ్వు వొంగుతుంటే
పైటకొంగు నిలవలేక జారుతుంటే
ఓలాల. ఓలాల.. ఓలాల... ఓలాల....
పైరేమి చూస్తావు చేనులోనా
ఈ పంట చూడు పిల్లగో చెంగులోనా
ఓయ్ నీ పిక్క బలుపు చూస్త నీ రెక్క నులుపు చూస్తా
నా కన్నె తలుపు తీస్త నీకున్న ఉడుకు చూస్తా
సింగారం చిగురందం వయ్యారం వడి ఆందం
అన్నిటికీ తప్పదులే ఆ ఎంగిలీ
ఓలాల వచ్చి వాలాలా. ఓలాల ఓలాల వచ్చి వాలాలా..
ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు
ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా...

చరణం : 2

మెరక మీద నువ్వు అరక దున్నుతుంటే
నీ కుచ్చుపాగ గుండేలోన గుచ్చుకుంటే
ఓలాల. ఓలాల.. ఓలాల... ఓలాల....
పాగనేమి చూస్తావె పడుచుదాన
నా నాగలుంది చూడవే పదునులోనా
నీ ఒడ్డూ పొడుగు చూస్తా.. నా వొల్లే మరచి పోతా...
నీ ఒంపే ఒలకబోస్తె.. నీ ఒల్లో మంచమేస్తా...
శ్రీకారం సిగ్గందం.. మందారం బుగ్గందం...
ముచ్చటగా తప్పదులే ముద్దెంగిలి...
ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా...
ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు
ఓలాల వచ్చి వాలాలా..
నీ బుగ్గ నా మొగ్గ నడిమధ్య ఎవరడ్డు
ఛీ పోలా తీపి కోపాలా.. ఓలాల వచ్చి వాలాలా...

President Gari Pellam : Thassa Chekka Song Lyrics (తస్స చక్క తలాంగు చుక్క)

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పల్లవి :

తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క
తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క
కౌగిల్ల పాడుకి కరనం నీవే
ముద్దంటు పల్లకి మునసవి నీవె
రాగల పల్లకీ రానివి నీవే
నా ప్రేమ నగరుకి ప్రెసిడెంటువులే
తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క

చరణం : 1

నీకున్న రుచి కన్నె కసి దోచుకుంటా
ఉంటా జంటా
నీ ఆడ జలి ఈద గిలి పంచుకుంటా
ఇంటా వంటా
అసలే సోకు నన్నంటుకోకూ
కొసరే కొంగాటలో
కుదిపెయ్మాకు కుస్తీకి రాకు
మొదతి ముద్దాటలో
ముచ్చంట ముచ్చమట మెర మెర మెరిసే
తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క
తస్స చక్క...చక్క
తలాంగు చుక్క....చుక్క
ఎంతో చక్క...చక్క
చెక్కిల్ల చుక్క...చుక్క

చరణం : 2

నా సిగ్గు సిరి చీర పురి ఇచ్చుకుంటె
ఎట్ట తంటా
నీ కంటి గురి కండ సిరి గుచ్చుకుంటె
కొట్టె గంట
ముద్దబంతీ ముద్దొచెయిందీ ముసిగ నవ్విందిలే
నవ్వె కొద్ది నా ఈడు రద్ది ఎదనె కవ్వించలే
పూల జడ పాల మెడ మనువులు అడిగే
తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క
కౌగిల్ల పాడుకి కరనం నీవే
ముద్దంటు పల్లకి మునసవి నీవె
రాగల పల్లకీ రానివి నీవే
నా ప్రేమ నగరుకి ప్రెసిడెంటువులే
తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క

President Gari Pellam : Umma Kavali Song Lyrics (ఉమ్మ్-మ్మ కావాలి)

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి




పల్లవి :

ఉమ్మ్-మ్మ కావాలి ఉంగా ఉంగా
ఊపు రావాలి ఉందా ఉందా
అడగలేని ఆకలి పుట్టి అలమటించి పోతున్న
కలవలేని కౌగిలి పట్టి కలవరించి వస్తున్నా
ఏమో దామో నీలో చెమ్మ నాదే నమ్మ
ఉమ్మ్-మ్మ కావాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా
అనుభవాల ఉప్పెనలోనే అందమందుకుంటున్న
అడ్డుగోడ దూకుడు తోనే ఒడ్డు చేరుకుంటున్న
ఏమో దామా గుమ్మా బొమ్మ నాదే నమ్మ
ఉమ్మ్-మ్మ కావాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా

చరణం : 1

వెచ్చనైన పక్కా విచ్చుకుంది రెక్క
రెచ్చగొట్టినాక రేపు లేదిక
ఆకులోని వక్క పెట్టకుంటే తిక్క
అంటుకుంటే లక్క ఎర్ర కాటుక
అదేదే చేసి చూపనా ఇలాగ అలాగా
సరేలే దారి చూపవా అలాగే భలేగా
పేర పేర పెదవుల కోసం పాపం అంతో ఇంతో ఎంతో కొంతో
ఉమ్మ్-మ్మ కావాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా


చరణం : 2

మాయగుంది గోదా సోయగాల సోదా
అందమైన ఆదా అప్పుడే కదా
ఉక్కపోత మీద ఊపిరాడ లేదా
చెప్పలేని బాధ  తప్పదీ కథ
మరింత దోచి చూడన మజాల ఖజానా
అదింకా దాచ లేనులే పలానా ఫలానా 
ఇరువున తానా మీదే పూలే రాగం తీయలమ్మా
ఉమ్మ్-మ్మ కావాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా
అడగలేని ఆకలి పుట్టి అలమటించి పోతున్న
అనుభవాల ఉప్పెనలోనే అందమందుకుంటున్న
ఉమ్మ్-మ్మ కావాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా

24, జూన్ 2021, గురువారం

President Gari Pellam : Nuvvu Malleteega song lyrics (నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ)

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


పల్లవి :

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా
తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా
అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా
సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా

చరణం : 1
పెదాలకు చేరెను పెళ్ళికి చెందిన సందడి నీ ముద్దులాగ వయస్సున కూసె వసంతం లాడిన కోరిక సన్నయిలాగ రుచించిన చెక్కిల్లలో రచించిన చేరాతలే వరించిన వారాలలో స్మురించెను శుభలేఖలై మనసే మనువాడుకున్న

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
చరణం : 2

ముఖాలకు వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు రా రమ్మనేగా సుఖాలుగ మారెను ఇద్దరి వత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా కథే ఇక మారిందిలే గతే ఒక్కటవుతుందిలే కలేసిన కాలాలలో కలే నిజమయ్యిందిలే తొడిమే తడి చేసుకున్న

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా