చిత్రం: శ్రీమంతుడు(2015 )
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సూరజ్ సంతోష్, కార్తికేయన్, రేణినా రెడ్డి
సూర్యవంశ తేజమున్న
సుందరాంగుడు పున్నమీసెంద్రుడు మారాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జనమమెత్తిన మహానుభావుడు... వాడే శ్రీరాముడు రాములోడు వచ్చినాడురో దన్ తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో నారి పట్టి లాగినాడురో దన్ తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని పేలినట్టు విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ రాజ్యమంటె లెక్కలేదురో దన్ తస్సదియ్య అడవిబాట పట్టినాడురో పువ్వులాంటి సక్కనోడురో దన్ తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ రామసక్కనోడు మా రామసెంద్రుడంట ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట అందగాళ్లకే గొప్ప అందగాడట నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా జీవుడల్లే పుట్టినాడురో దన్ తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో నేలబారు నడిచినాడురో దన్ తస్సదియ్య పూల పూజలందినాడురో పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి