29, జూన్ 2021, మంగళవారం

Varsham : Nuvvosthanante Song Lyrics (చినుకు రవ్వలో)

చిత్రం: వర్షం(2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మల్లికార్జున్, కల్పన

సంగీతం: కె.యస్.చిత్ర , రకీబు ఆలం




పల్లవి :

చినుకు రవ్వలో… చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో చినుకు రవ్వలో… చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో పంచవన్నె చిలకలల్లె… వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న… వాన గువ్వలో చినుకు రవ్వలో… చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో

చరణం: 1 :

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే… చూసెళ్ళి పోతావే అచ్చంగా నాతోనే… నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఆఆ తరికిట తరికిట త ఇన్నాళ్ళకు… గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని… దాక్కుంటావే పైన

చరణం: 2:

ముద్దులొలికే ముక్కుపుడకై… ఉండిపోవే ముత్యపు చినుకా చెవులకు చక్కా జూకాల్లాగా… చేరుకోవే జిలుగుల చుక్కా చేతికి రవ్వల గాజుల్లాగా… కాలికి మువ్వల పట్టీలాగా మెళ్లో పచ్చల పతకంలాగా… వగలకు నిగనిగ నగలను తొడిగేలా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా హా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఆహా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఆఆ తరికిట తరికిట త ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా చిన్ననాటి తాయిలంలా… నిన్ను నాలో దాచుకోనా కన్నెఏటి సోయగంలా… నన్ను నీలో పోల్చుకోనా పెదవులు పాడే… కిలకిల లోనా పదములు ఆడే… కథకళి లోనా కనులను తడిపే… కలతల లోనా నా అణువణువున… నువు కనిపించేలా నువ్వొస్తానంటే హా… నేనొద్దంటానా నువ్వొస్తానంటే హే హే… నేనొద్దంటానా… ఆఆ తరికిట తరికిట త… ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే… చూసెళ్ళి పోతావే అచ్చంగా నాతోనే… నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా…




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి