13, జూన్ 2021, ఆదివారం

State Rowdy : Chukkala Pallakilo Song lyrics (చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో)

 

 చిత్రం : స్టేట్ రౌడీ

సంగీతం :  బప్పీలహరి

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: బాలసుబ్రహ్మణ్యం,సుశీల


F : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో M : అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా M&F : ఆఆ.. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో M : నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలని F : ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలని M : హే పడుచుదనం చెప్పిందిలే F : పానుపు మెచ్చిందిలే ..హా... M : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో M : తలపులు ఉబికిన తొలకరి వయసుకు తొలిముడి విప్పాలని F : పెరిగే దాహం జరిపే మధనం పెదవికి చెప్పాలని M: హే తనువెల్లా కోరిందిలే.. F: తరుణం కుదిరిందిలే ఓ ఓ M : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో F : అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా F : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి