చిత్రం:సూరిగాడు(1992)
సంగీతం: వాసు రావు
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
పల్లవి:
ఆశా......
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
కమ్మని కౌగిలి కోరితే దురాశ
తియ్యని పెదవులు కలిపితే ఓ నిషా
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
చరణం:1
చెదిరిన పైటకు బహుమతిగా
చిలిపి ముద్దులు అందించనా
నలగని పువ్వుల నవ్వులతో
వలపు సుద్దులు నేర్పించనా
కులుకులు తగవే నా అలకల చిలక
గడబిడ తగునా నా మగసిరి మొలక
పరువమే ఇలా ఇలా పిలిచే మరి
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
ఒకే ఒక ఆశ
చరణం:2
మదనుడు మరచిన శరములేవో
వెలికి తీసా నీ కోసమే
చల్లని వెన్నెల పల్లకిలో
ఎదురుచూసా నీ కోసమే
తరగని కలలే రా రమ్మని పిలువా
త్వరపడి ఒడిలో చోటిమ్మని అడిగా
సొగసరి సరాసరి పదవే మరి
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
కమ్మని కౌగిలి కోరితే దురాశ
తియ్యని పెదవులు కలిపితే ఓ నిషా
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి