Surigaadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Surigaadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2023, శుక్రవారం

Surigadu : Ammalalo Song Lyrics (అమ్మలాలో అమ్మలాలో)

చిత్రం:  సూరిగాడు (1992)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: వాసు రావు


పల్లవి:

F : అమ్మలాలో అమ్మలాలో      అబ్బాయి చేశాడు విన్నపాలు M : అబ్బ లాలో అబ్బాలాలో     అమ్మాయి చేయాలి సంతకాలు F : ఓకే అంటే...నువ్వే ఉంటా M: రైటో అంటూ.. బైటా ఇస్తా F : అమ్మలాలో అమ్మలాలో      అబ్బాయి చేశాడు విన్నపాలు M : అబ్బ లాలో అబ్బాలాలో     అమ్మాయి చేయాలి సంతకాలు

చరణం 1: M : పడుచు వయసు పదును మీరీ      పెదవి అడిగితే.. ఏరి కోరి వచ్చానమ్మో.. F: చిలిపి చేయి అదును చూసి      ఎదను తాకితే..     నాలో గుబులు రేగిందయ్యో.. M : సుడిగాలిలా చుట్టేయన      కేరింతలే కొట్టేయన F : సై అంటు నే వచ్చేయనా      సిగ్గంతా నీకిచ్చెయనా M: సన్నాయి మోగాలి వెండిమబ్బు నీడలోన F : అమ్మలాలో అమ్మలాలో      అబ్బాయి చేశాడు విన్నపాలు M : అబ్బ లాలో అబ్బాలాలో      అమ్మాయి చేయాలి సంతకాలు


చరణం 2: F : వగలమారి జిలుగు రవిక      రొప్పు తున్నది..      ఏదో ఏదో కావాలని M : మొగలిరేకులు నిద్రలేచి      నిలిచి ఉన్నది..      అంతూ పొంతూ చూడాలని F : రెచ్చిందిలే ఆరాటము      తీరేదెలా.. రెబలాటము M :హెచ్చిందిలే.. ఆవేశము      సాగించనా కోలాటము F : సోకంతా సోక్కాలి      పొగడ పూల పక్క మీద      అమ్మలాలో అమ్మలాలో     అబ్బాయి చేశాడు విన్నపాలు M : అబ్బ లాలో అబ్బాలాలో      అమ్మాయి చేయాలి సంతకాలు F : ఓకే అంటే...నువ్వే ఉంటా M : రైటో అంటూ.. బైటా ఇస్తా F : అమ్మలాలో అమ్మలాలో      అబ్బాయి చేశాడు విన్నపాలు

M : అబ్బలాలో అబ్బాలాలో      అమ్మాయి చేయాలి సంతకాలు        అబ్బలాలో అబ్బాలాలో

20, జూన్ 2021, ఆదివారం

Surigadu : Kottindammo Song Lyrics (కొట్టిందమ్మో కొట్టిందమ్మో)

 చిత్రం:సూరిగాడు(1992)

సంగీతం: వాసు రావు

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



కొట్టిందమ్మో కొట్టిందమ్మో పైట గాలి కొట్టిందమ్మో కుట్టిందయ్యో కుట్టిందయ్యో ప్రేమ చీమ కుట్టిందయ్యో చక్కగా ముచ్చటెే తీర్చుకోనా వెచ్చగా ముద్దులే ఇచ్చుకోనా వెన్నెల్ల ఉయ్యాలలో కొట్టిందమ్మో కొట్టిందమ్మో పైట గాలి కొట్టిందమ్మో కుట్టిందయ్యో కుట్టిందయ్యో ప్రేమ చీమ కుట్టిందయ్యో కన్నె తీగ తెంపమాకు ఫటా ఫటా... దొంగ దెబ్బ తీయమాకె ఎడా పెడా... సందుచూసి హత్తుకొకు హరోంహరా వంతులేసి వత్తుకోకు చెడా మడా... పట్టెయ్యి పటకా ఎత్తయి జటకా... తెలిసిందె కిటుకు నా లింగు లిటుకు వెన్నెల్ల ఉయ్యాలలో కొట్టిందమ్మో కొట్టిందమ్మో పైట గాలి కొట్టిందమ్మో కుట్టిందయ్యో కుట్టిందయ్యో ప్రేమ చీమ కుట్టిందయ్యో కన్ను కొట్టి లవ్వు యాత్ర లాగించనా వెన్ను తట్టి ప్రేమ మాత్ర మింగించనా

సాగనివ్వు సంబరాలు సజావుగా ఆరగించు అందమంతా నీకార్సుగా తీసెయ్యి పరదా చూసేయి సరదా కూసీంది చిలకా కంగారుపడకా వెన్నెల్ల ఉయ్యాలలో కొట్టిందమ్మో కొట్టిందమ్మో పైట గాలి కొట్టిందమ్మో కుట్టిందయ్యో కుట్టిందయ్యో ప్రేమ చీమ కుట్టిందయ్యో చక్కగా ముచ్చటెే తీర్చుకోనా వెచ్చగా ముద్దులే ఇచ్చుకోనా వెన్నెల్ల ఉయ్యాలలో కొట్టిందమ్మో కొట్టిందమ్మో పైట గాలి కొట్టిందమ్మో కుట్టిందయ్యో కుట్టిందయ్యో ప్రేమ చీమ కుట్టిందయ్యో

Surigadu : Oke Oka Asha Song Lyrics (ఒకే ఒక ఆశ అదే నా శ్వాస)

 చిత్రం:సూరిగాడు(1992)

సంగీతం: వాసు రావు

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


పల్లవి: ఆశా...... ఒకే ఒక ఆశ అదే నా శ్వాస ఒకే ఒక ఆశ అదే నా శ్వాస కమ్మని కౌగిలి కోరితే దురాశ తియ్యని పెదవులు కలిపితే ఓ నిషా ఒకే ఒక ఆశ అదే నా శ్వాస చరణం:1 చెదిరిన పైటకు బహుమతిగా చిలిపి ముద్దులు అందించనా నలగని పువ్వుల నవ్వులతో వలపు సుద్దులు నేర్పించనా కులుకులు తగవే నా అలకల చిలక గడబిడ తగునా నా మగసిరి మొలక పరువమే ఇలా ఇలా పిలిచే మరి ఒకే ఒక ఆశ అదే నా శ్వాస ఒకే ఒక ఆశ చరణం:2 మదనుడు మరచిన శరములేవో వెలికి తీసా నీ కోసమే చల్లని వెన్నెల పల్లకిలో ఎదురుచూసా నీ కోసమే తరగని కలలే రా రమ్మని పిలువా త్వరపడి ఒడిలో చోటిమ్మని అడిగా సొగసరి సరాసరి పదవే మరి ఒకే ఒక ఆశ అదే నా శ్వాస కమ్మని కౌగిలి కోరితే దురాశ తియ్యని పెదవులు కలిపితే ఓ నిషా ఒకే ఒక ఆశ అదే నా శ్వాస ఒకే ఒక ఆశ అదే నా శ్వాస