Surya IPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Surya IPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, డిసెంబర్ 2024, శనివారం

Surya IPS : Hatthiree Ado Madiri Song Lyrics (హత్తెరీ అదో మాదిరి)

చిత్రం: సూర్య.IPS(1991 )

సంగీతం: ఇళయరాజా

రచన: సి.నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి :

హత్తెరీ అదో మాదిరి హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి
హత్తెరీ అదో మాదిరి హరి హరి ఇదే మాధురి
చేసావే చేతబడి చెడిపోయే పాత మడి చిక్కవే లేడి
చేసావే చేతబడి చెడిపోయే పాత మడి చిక్కవే లేడి
హత్తెరీ అదో మాదిరి హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి
హత్తెరీ అదో మాదిరి హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి

చరణం: 1

గువ్వ గూడెక్కె గుండె వేడెక్కె
ఒళ్ళు ఊపెక్కె కళ్ళు మీదెక్కె రా జరా ఇలా
మోజు ఆకట్టె ముద్దు జోకొట్టె
సిగ్గు అరికట్టె ముగ్గు గిలకొట్టె జా మరో మజా
ముద్దొచ్చే కోరికలే ముందిచ్చే కానుకలై తేరాదా
ఒక్కొక్క మైవిరుపే పక్కేసే పై మెరుపై రారాదా
కొత్త గొంతొచ్చి కోన కూసింది కోయిలలా

హత్తెరీ అదో మాదిరి హరి హరి ఇదే మాధురి
ఇన్నాళ్ళు మూతబడి వున్నాది వలపు గుడి వెయ్యనా బేడి
చేసావే చేతబడిచెడిపోయే పాత మడి చిక్కవే లేడి హోయ్
హత్తెరీ అదో మాదిరి హరి హరి ఇదే మాధురి
హత్తెరీ అదో మాదిరి హరి హరి ఇదే మాధురి

చరణం: 2

సందె చీకట్లో పొందు ముచ్చట్లొ
పండు వెన్నెట్లో పాడు నిదరట్లో ఓ అదో సుఖం
మావి తోపుల్లో మండుటెండల్లో
ఏమీ దాగుళ్ళో ఎన్నీ కౌగిళ్ళో ఆ అదో జ్వరం
పన్నీట ఆరేదా కన్నీట తీరేదా ఆ దాహం
వాకిట్లో ఆగేదా గుప్పిట్లో దాగేదా ఆ మోహం
జాము రేయొచ్చి ప్రేమ నవ్వింది జాబిలిలా

హత్తెరీ అదో మాదిరి హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి
చేసావే చేతబడి చెడిపోయే పాత మడి చిక్కవే లేడి
ఇన్నాళ్ళు మూతబడి వున్నాది వలపు గుడి వెయ్యనా బేడి
హత్తెరీ అదో మాదిరి హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి
హత్తెరీ అదో మాదిరి హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి

20, జూన్ 2021, ఆదివారం

Surya IPS : Nelaraja Ituchoodara song lyrics (నెలరాజ ఇటు చూడరా)

చిత్రం: సూర్య.IPS(1991 )

సంగీతం: ఇళయరాజా

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి :

నెలరాజ ఇటు చూడరా నెలరాజ ఇటు చూడరా ఉలుకేలర కులుకేలర వలరాజా తగువేలర తగువేలర రవితేజ నవరోజ తేర తీయవ నవరోజ తేర తీయవ

చరణం: 1

నీ కోసం ఆషగ నిరీక్షించే ప్రాణం నీ చేత్తుల్ల వాలగ చిగిర్చింది ప్రాయం నీ వైపె దీక్షగ చేల్లించింది పాదం నీ రూపే దీపమై ప్రయాణించే జీవం నివాలిచ్చి నవనవలన్ని నివేదించనా నువ్వేలేని నిమిషాలన్ని నిషెదించన రతి రాజువై జత చేరవా విరి వానవై నన్ను తాకవా నవరోజ తేర తీయవ నవరోజ తేర తీయవ దివ్వి తారక నన్ను చేరగ నిన్ను చూచ జవనాలతో జరిపించవే జత పూజ నెలరాజ ఇటు చూడరా నెలరాజ ఇటు చూడరా

చరణం: 2

ఈ వెన్నెల సాక్షిగ యుగలాగిపోని ఈ స్నెహం జంటగ జగలెలుకోని నీ కనుల్ల పాపగ కల్లలు ఆడుకోని నీ కౌగిల్లి నీడలో సద సాగిపోని ప్రపంచాల అంచులుదాటి ప్రయణించని దిగంతాల తారలకోట ప్రవేశించని గతజన్మనే బ్రతికించని ప్రణయాలలో శ్రుతిపేంచని నెలరాజ ఇటు చూడరా నవరోజ తేర తీయవ ఉలుకేలర కులుకేలర వల రాజ జవనాలతో జరిపించవే జత పూజ నెలరాజ ఇటు చూడరా నెలరాజ ఇటు చూడరా


Surya IPS : Om Namo Nama Yavvanama song lyrics(ఓం నమో నమా యవ్వనమా రావమ్మా)

చిత్రం: సూర్య.IPS(1991 )

సంగీతం: ఇళయరాజా

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి :
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యోరామా.. ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
చరణం: 1
ఏపుగ ఊగే ఒంపుల పైరూ.. కోతకు సైయందే హ హ హ హా ఊపుగ రేగే చూపుల ఏరూ కోకను తోసిందే... కొంగెట్టి కూసే రంగుల ఊసే ఒంగొంగి చూసే లొంగని ఆశే వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ ఏమూల దాచేదీ సింగారం ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యోరామా.. ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
చరణం: 2
ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే... పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే... ఏకల్లే చేరి మేకైనావూ సోకుల్లో ఊరి చెలరేగావూ తాంబూలం తెచ్చా.. తడి పొడి పంచా ఎన్నాళ్ళు మోస్తావు.. వయ్యారం ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యోరామా.. ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా