29, జూన్ 2021, మంగళవారం

Varsham : Mellaga Karagani Song Lyrics (మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం)

చిత్రం: వర్షం(2004 ) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: S.P.B.చరణ్, సుమంగళి






పల్లవి:

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం

చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం

వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం

చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం

తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుల వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం

ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం


చరణం:1

నీ మెలికలలోన ఆ మెరుపును చూస్తున్నా

ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా

ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా

ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా

మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా

జతపడే స్నేహమై అనునయించనా

చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిను విడదా


చరణం:2

ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా

నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా

ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా

ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైనా

త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా

విడుదలే వద్దనే ముడులువేయనా

మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి