చిత్రం: వర్షం(2004)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: అద్నాన్ సమీ, సునీత రావు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
హోయ్...
హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
హే ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని
హేయ్ నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని
అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి
శాసిస్తే చాలు ఓ సారి సిద్దంగా ఉంది సింగారి
అయ్యరే సయ్యంటుందే తయ్యారై వయ్యారి
నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని
చరణం: 1 :
హే... సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరీ
చాల్లెద్దూ మాట కచేరి దోచేద్దూ తళుకు తినారి
ముదిరావే మాయలమారి
మురిపిస్తే ఎలా మురారి
హే పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావె పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి
గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి
నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి
ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని
చరణం: 2 :
హే... వరదల్లే హద్దులు మీరి వచ్చావా పొగడల పోరి హే సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకుపోతా నారి దాటొస్తా సిగ్గుల ప్రహరి హేయ్ చేరుస్తా చుక్కల నగరి ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓ సారి మైకంలో తూరి ఓ సారి కావ్యంలో వాలి ఓసారి వాహ్ వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి