చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి:
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో..... చరణం: 1
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో…... చరణం: 2
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మథునితో జన్మ వైనం చాటినపుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో…...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి