చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి:
రంగులలో కలవో.. ఎదపొంగులలో కళవో (2) నవ శిల్పానివో.. రతి రూపానివో తొలి ఊహల ఊయలవో !! రంగులలో కలవో.. ఎదపొంగులలో కళవో చరణం 1:
కాశ్మీర నందన సుందరివో (2) కైలాస మందిర లాస్యానివో ఆమని పూచే యామినివో (2) మరుని బాణమో.. మధుమాస గానమో నవ పరిమళాల పారిజాత సుమమో రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై నవ శిల్పాంగినై.. రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా !! రంగులలో కలనై.. చరణం 2:
ముంతాజ్ అందాల అద్దానివో (2) షాజహాన్ అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో (2) ప్రణయ దీపమో.. నా విరహ తాపమో నా చిత్రకళల చిత్ర చైత్ర రథమో రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై నవ శిల్పాంగినై.. రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా !! రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి