చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం మింగినాను హాలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చరణం:1
ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు కన్నీరుగా ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చరణం:2
నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం మింగినాను హాలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి