30, జులై 2021, శుక్రవారం

Allari Premikudu : Puttadi Bommaku Song Lyrics (పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే)

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి:

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులుపుట్టే.... పన్నీటి స్నానాలు చేసే వేళలో నున్నని చెంపకు సిగ్గులు పుట్టే అన్నుల మిన్నకు అల్లరి పెట్టే.. కనరాని బాణాలు తాకే వేళలో... చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ చేయూత సాయంగా అందియ్యవేమి నా ప్రేమ సామ్రాజ్యదేవి... పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ సరేనంటే రూపం తాపం సమర్పయామీ నీ సన్నిధిలోనే సమస్తము..నివేగయామీ

చరణం 1:

కునుకుండదు కన్నులలోనా...కుదురుండదు గుండెలలో.. అణువణువు కోరుకుతున్నది...తియ్యని మైకం... ఎదిగోచ్చిన వన్నెల వాన..ఒదిగుండదు వంపులలో చెరనోదిలి ఉరుకుతున్నది ...వయసు వేగం మనసుపడే కానుకా..అందించనా ప్రేమికా దహించితే కోరికా...సహించకే గోపికా అదిరేటి అధరాల ఆనా... అందం చందం అన్ని నీకే...సమర్పయామి ఆనందమంటే చూపిస్తాలే...చెలి ఫాలోమీ పుత్తడి బోమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ

చరణం 2:

నులివెచ్చని ముచ్చటలోన...తొలి ముద్దులు పుచ్చుకోనీ సరిహద్దులు దాటవే...ఒంటరి కిన్నెరసాని నును మెత్తని సోయగమంతా...సరికొత్తగ విచ్చుకోని ఎదరొచ్చిన కాముని సేవకు...అంకితమవనీ అవి ఇవి ఇమ్మనీ...అదే పనిగా వేడనీ ఇహం పరం దువ్వనీ...పదే పదే పాడనీ తెరచాటు వివరాలు అన్నీ... దేహం దేహం తాకే వేళ..సంతర్పయామీ సందేహం మోహం తీరేవేళ...సంతోషయామీ పుత్తడి బొమ్మకు సెగలుపుట్టే ముద్దులగుమ్మకు దిగులు పుట్టే.. పన్నీటి స్నానాలు చేసే వేళలో... నున్నని చెంపకు సిగ్గులు పుట్టే అన్నుల మిన్నకు అల్లరి పెట్టే.. కనరాని బాణాలు తాకే వేళలో... చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ చేయూత సాయంగా అందియ్యవేమి నా ప్రేమ సామ్రాజ్యదేవి... పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి