19, జులై 2021, సోమవారం

Bhairava Dweepam : Virisinadi Vasantha Song Lyrics (విరిసినది వసంతగానం)

చిత్రం: భైరవ ద్వీపం

సంగీతం:మాదవపెద్ది సురేష్   

సాహిత్యం: సింగీతం శ్రీనివాస రావు

గానం: చిత్ర 



పల్లవి: విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసింది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం1:

ఝుమ్మంది నాదం రతివేదం జతగూడే భ్రమర నాదం రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం పరువాల వాహిని ప్రవహించె ఈ వని ప్రభవించె ఆమని పులకించె కామిని వసంతుడే చెలికాంతుడై దరిచేరే మెల్లగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం2:

ఋతువు మహిమేమో విరితేనె జడివానై కురిసె తీయగా లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా రాచిలుక పాడగా రాయంచ ఆడగా రసలీల తోడుగా తనువెల్ల ఊగగా మారుడే సుకుమారుడై జతగూడె మాయగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసింది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి