Bhairava Dweepam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bhairava Dweepam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జులై 2021, సోమవారం

Bhairava Dweepam : Yentha Yentha Vintha Song Lyrics (ఎంత ఎంత వింత మోహమో)

చిత్రం: భైరవ ద్వీపం

సంగీతం:మాదవపెద్ది సురేష్   

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం ,సంధ్య



పల్లవి: చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేలనమ్మ ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మ చందనాలు పూసినా ఎంత సేవ చేసినా చింత తీరదేలనమ్మ ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మ జంట లేదనా హహహ ఇంత వేదనా హొహొహొ జంట లేదనా ఇంత వేదనా ఎంత చిన్నబోతివమ్మ చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేలనమ్మ ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మ చందనాలు పూసినా ఎంత సేవ చేసినా చింత తీరదేలనమ్మ ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మ ఓ మురిపాల మల్లిక దరిచేరుకుంటినే పరువాల వల్లిక ఇది మరులుగొన్న మహిమో నిను మరువలేని మైకమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో ప్రణయానుబంధమెంత చిత్రమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శౄంగార మంత్రమో చరణం1: విరిసిన వనమో యవ్వనమో పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా చలువల వరమో కలవరమో తరిమింది తీపి కోరిక చెలువను చూడగా దరిశనమీయవే సరసకు చేరగా, తెరలను తీయవే తళుకుల తారక మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో చరణం2: కలలను రేపే కళ వుంది అలివేణి కంటి సైగలో జిగి బిగి సోకులో ఎడదను ఊపే ఒరుపుంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో కదలని ఆటగా నిలిచిన వేడుక బదులిడ రావుగా పిలిచిన కోరిక బిడియమదేలా ప్రియురాల మణిమేఖల ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో ప్రణయానుబంధమెంత చిత్రమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో

Bhairava Dweepam : Sri Tumbura Song Lyrics (శ్రీతుంబుర నారద నాదామృతం)

చిత్రం: భైరవ ద్వీపం

సంగీతం:మాదవపెద్ది సురేష్   

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం 



శ్రీతుంబుర నారద నాదామృతం శ్రీతుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సపస గరిసనిదపమగ నిగ మగరిసనిస సగమ గమప మపనిస గరిసనిద రిసనిదప సనిదపమ శ్రీతుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం స, స ససస సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిదప మగరి శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే గ గా గారిస రిసద సదప గగపదస మురళి వనాంతాల విరుయు వసంతాల మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే మ సమగసనిదమ సమగ మదని మదనిగస మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగరి గమప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న నినిపమగమ పనిమపనినిస నిని సస సస, నిని రిరి రిరి నిని గగ గమ రిగ సరి నిస పనిస మపని గమప సగమ సమగపమని పసనిరిసగ మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ సగమప గమపని మపనిస గసగ గమప గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి నినినిసస సస నినిని గగ గగ నినిని మమగమ పమగమగరిస గగగ పపపప గగగ నినినిని గగగ సస నిస గరి సమ గరిస నిస నిస నిస నిస పని పని పని మప నిస నిస నిస నిస పని పని పని మప గమ గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ గమ సగ సగ సగ నిస నిస గమ సగ మప గమ పని మప నిస సగ మప గమ పని మప నిస పని సగ సస సస సస రిరి రిరి రిరి సస సస సస గగ గగ గగ రిరి రిరి రిరి గగ గగ గగ రిరి రిరి రిరి మమ మమ మమ గమ గమ గమ గమ గమ గస గమప శ్రీతుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం

Bhairava Dweepam : Naruda O Naruda Song Lyrics (నరుడా ఓ నరుడా ఏమి కోరిక)

చిత్రం: భైరవ ద్వీపం

సంగీతం:మాదవపెద్ది సురేష్   

సాహిత్యం: వేటూరి

గానం: జానకి 



నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక చరణం: 1 రా దొరా ఒడి వలపుల చెరసాలర లే వరా ఇవి దొరకని సరసాలురా దోర దొంగ సోకులేవి దోచుకో సఖా రుతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధలే కొసరగా ఇంత పంతమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక చరణం: 2 నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ కసి స్వరమెరుగని ఒక జావళి లేత లేత వన్నెలన్నీ వె న్నెలేనయా రగిలే వయసులో రసికత నాదిరా పగలే మనసులో మసకలు కమ్మెరా ఇంత బింకమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక

Bhairava Dweepam : Virisinadi Vasantha Song Lyrics (విరిసినది వసంతగానం)

చిత్రం: భైరవ ద్వీపం

సంగీతం:మాదవపెద్ది సురేష్   

సాహిత్యం: సింగీతం శ్రీనివాస రావు

గానం: చిత్ర 



పల్లవి: విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసింది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం1:

ఝుమ్మంది నాదం రతివేదం జతగూడే భ్రమర నాదం రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం పరువాల వాహిని ప్రవహించె ఈ వని ప్రభవించె ఆమని పులకించె కామిని వసంతుడే చెలికాంతుడై దరిచేరే మెల్లగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం2:

ఋతువు మహిమేమో విరితేనె జడివానై కురిసె తీయగా లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా రాచిలుక పాడగా రాయంచ ఆడగా రసలీల తోడుగా తనువెల్ల ఊగగా మారుడే సుకుమారుడై జతగూడె మాయగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసింది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

Bhairava Dweepam : Ghataina Prema Song Lyrics (ఘాటైన ప్రేమ ఘటన..)

చిత్రం: భైరవ ద్వీపం సంగీతం:మాదవపెద్ది సురేష్ , సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 

ఘాటైన ప్రేమ ఘటన.. ధీటైన మేటి నటన అందంగా అమరిందిలే.. ఇక ఆనందం మిగిలిందిలే నిజమెరుగవే పసిచిలక ఘాటైన ప్రేమ ఘటన..    ధీటైన మేటి నటన   ఆనందం చిందించెలే.. నా అందం నీ వశమాయెలే తెరమరుగిక తొలగునులే

కోరుకున్న వాడే తగువేళ చూసి జతగూడే..       సుముహూర్తం ఎదురైనది.. అందమైన ఈడే అందించమంటూ దరిచేరే..      సందేశం  ఎద విన్నది.. లేనిపోని లోని శంక..   మానుకోవె బాలిక ఏలుకోవా గోరువంక     లేత నీలి కానుక కులుకా  రసగుళిక  కళలొలుక      తగు తరుణము దొరికెనుగా ఘాటైన ప్రేమ ఘటన..      ధీటైన మేటి నటన     ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే      తెరమరుగిక తొలగునులే

పూజలన్నీ పండె పురివిప్పి నేను జతులాడి అనురాగం శృతి చేయగా మోజులన్నీ పిండే మగతోడు చేరు ఈనాడు            సుఖభోగం  మొదలౌనుగా ఊసులన్నీ మాలగా.. పూసగుచ్చివేయనా.. రాచకన్నెనేలగా.. దూసుకొచ్చి వాలనా.. కరిగా.. తొలకరిగా.. రసఝరిగా అణువణువొక  చినుకవగా ఘాటైన ప్రేమ ఘటన..   ధీటైన మేటి నటన అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే.. నిజమెరుగవే పసిచిలక ఘాటైన ప్రేమ ఘటన..    ధీటైన మేటి నటన    ఆనందం చిందించెలే..    నా అందం నీ వశమాయెలే తెరమరుగిక తొలగునులే