Raja Vikramarka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raja Vikramarka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, నవంబర్ 2021, గురువారం

Raja Vikramarka : Gagana Kirana song Lyrics (గగన కిరణ గమనమిది)

చిత్రం: రాజా విక్రమార్క (1990)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం:రాజ్-కోటి



గగన కిరణ గమనమిది భువన భవన చలనమిది చలిత లలిత కధనమిదే జతిని తెలుసుకో స్త్రీ రాగం పాడే శృంగార క్షణాల్లో శ్రీ శ్రీ లో రేగే కవితాగ్ని కణాల్లో డేలా నేనే జ్వాలా చినవాడికే చిరాకా? పరువానికే పరాకా? పిలిచేనులే ప్రియాంకా మది నే మయూరికా విధితో సమరం (గతం గమకం) చెలితో సరసం (శుభం సుముఖం ) శృతిలో కలిపి లయలో నడిచా జరిపే నటనం (కథం చలనం) జరిగే ఘటనం (అసం భరితం) మొదటే తెలిసీ జతగా కలిశా ఎదురైతే సవాలూ ఎదురొచ్చే శివాలూ పడతాలే భరతాలెన్నో నీకూ పుడతాయి సరదాలెన్నో నాకూ నేల మీద నంది లేచి నెత్తి మీద గంగ దించి నాగరాగమందుకున్న ఆటమీద పాటమీద సాటీ పోటీ నేనే తగిలే పవనం (సుఖం పరువం) రగిలే జవనం (క్షణం చలితం) కలగా వెలిగీ కసితో కలిశా అటు ఓ విరహం (చిరం అచిరం) ఇటు ఓ కలహం (వరం సుచిరం) సుడులే తిరిగీ పిడుగై కదిలా మాయల్లో మజాలు మబ్బుల్లో జలాలు కెరటాలై పొంగే దాకా ఆగు గిరి చాటు కిన్నెరసాని వాగు కంచి కాడ తుంగభద్ర సొంపు చూడు వీరభద్ర జాజి వీణ తీగ మీటి జావళీలు పాడుకున్నా నాట్యం తీరం చూస్తా

Raja Vikramarka : Konda Kona song Lyrics (కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట)

చిత్రం: రాజా విక్రమార్క (1990)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:రాజ్-కోటి


ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా.. ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా..   ఏలేలో.. ఏలేలో.. కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఎంకి పాట పాడుకుంటూ ఎన్నెలంతా పంచుకుంటు గోరింట పండేటి వాలింటి పొద్దుల్లో నీ జంట నేనుంటె కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహో.. ఏలేలో.. ఏలోఏలో.. ఎదలోకి జరుగు పొదరింట కరుగు నే ముట్టుకున్న నా ముద్దబంతి ముద్దుకే జల్లెడ చినవాడి పొగరు చిగురాకు వగరు లోగుట్టులాగ నే తట్టుకుంట సాగిపో చంద్రుడా పచ్చంగా మెరిసేటి నీకళ్ళు రామ చిలకమ్మ గారాల పుట్టిళ్ళు గారంగ పట్టేటి కౌగిళ్ళు కన్నె వలపమ్మ నాట్యాల నట్టిళ్ళూ విరబుసిన పులకింతల పందిట్లొ ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా.. ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా..  కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహోయ్ హోలా.. హోలా.. హోలా.. హోలా.. పెదవింత కొరుకు మధువింత దొరుకు చిన్నోళ్ళ జంట వెయ్యేళ్ళ పంట వెన్నలో మీగడ తొలి సిగ్గు చెరిపే చలి ముగ్గులెరుపు మా ప్రేమ తంటా నీకెందుకంటా వెళ్ళిపో సుర్యుడా మూగేటి చీకట్ల మేఘాలు నన్ను తాకేటి నీ ప్రేమ దాహాలు అలిగేటి నీ కంటి దీపాలు ముద్దులడిగేటి నీ కన్నె తాపాలు ముసి నవ్వుల ముఖ వీణల ముంగిట్లొ ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా.. ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా..  కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహో

25, జులై 2021, ఆదివారం

Raja Vikramarka : Eraraoi Song Lyrics (ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది)

చిత్రం:రాజా విక్రమార్క(1990)

సంగీతం:రాజ్-కోటి

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం


ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఓరరెరె.. పల్లవొచ్చె నా గొంతులో ఎల్లువొచ్చె నా గుండెలో పుట్టుకొచ్చె ఎన్నెన్ని రాగాలో మందు కొట్టి ఒళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలో కైపులోన ఎన్నెన్ని కావ్యాలో రేపన్నదే లేదని ఉమరు కయ్యాము అన్నాడురా నేడన్నదే నీదని ధూళిపాటి చలమయ్య చెప్పాడురా రసవీరా కసితీరా నీరింటి చేపల్లె గాలింటి గువ్వల్లె నే తేలిపోతాను ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది దేవదాసు తాగాడురా వేదమేదో చెప్పాడురా విశ్వదాభి రాముడ్ని నేనేరోయ్ ఒంటికేమో ఈడొచ్చెరా ఇంటికొస్తే తోడేదిరా పుత్తడంటి పూర్ణమ్మ యాడుందో శృంగార శ్రీనాధుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా సంసార స్త్రీనాధుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా ప్రియురాలా జవరాలా నీ చేప కన్నల్లె నీ కంటిపాపల్లె నేనుండిపొతాలే ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఏరారోయ్..