చిత్రం: ఆహ్వానం (1997 ) సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా...
విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా
దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
చరణం 1 :
ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే
ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా
నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
నువ్వు రామ్మా ఓ అరుంధతి...
ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా
నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
చరణం 2 :
చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళకు విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి