Aahvaanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aahvaanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2024, ఆదివారం

Aahwanam : Aakasam Pandiri Vesindi Song Lyrics (ఆకాశం పందిరి వేసింది)

చిత్రం : ఆహ్వానం (1997 )

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి



పల్లవి  :

ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి అతడు: మంగళవాద్యాలు పిలుపును అందించగ ముంగిట మురిపాలు కళకళలాడగ ఆమె: పచ్చగ పెళ్ళయే ముహూర్తమె తథాస్తంది అతడు: ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది కోరస్: ఆ సువ్వి ఆహా సువ్వి ఆ సువ్వి ఆహా సువ్వి చరణం : 1 నలుగురూ చేరి నలుగుపెట్టరే చిన్నారికి జలకాలాడించరే ముద్దుగా ముస్తాబును చెయ్యరే బుగ్గమీద పెళ్ళిచుక్క దిద్దరే అతడు: వరుడితొ మగపెళ్ళివారు కోరస్: తయ్యారు అతడు: విడిదికి వియ్యాలవారు కోరస్: వచ్చారు అతడు: మనవిని మన్నించి మనువుకి రండయ్యా పప్పన్నం పెడతాం దయచేయండయ్యా అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా

ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి చరణం : 2 గౌరీపూజను చేసి కోరస్: చేసి ఆమె: నీ కోసం నోములు నోచి కోరస్: నోచి ఆమె: కులుకుల కాణాచి అదిగో వచ్చింది తెరవెనుకన వేచి కలలే కంటోంది పరిణయ ప్రమాణమే చేసి పొందమంటోంది

ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి చరణం : 2 పురోహితుడు: ధర్మేత్వయా యేశ నాతిచరితవ్యా కైకాల:||ధర్మే|| పురోహితుడు: అయ్య నాతిచరామి అనండి అతడు: నాతిచరామి పురోహితుడు: అర్థేత్వయా యేశ నాతిచరితవ్యా కైకాల:||అర్థే|| అతడు: నాతిచరామి పురోహితుడు: కామేత్వయా యేశ నాతిచరితవ్యా కైకాల:||కామే|| అతడు: నాతిచరామి కైకాల: అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారుగాని మరి వాటికి అర్థాలు తెలియాలి కదండీ చెబుతారా? అతడు: అలాగే ధర్మార్థకామములలోన ఏనాడూ - ఈమె తోడుని నీవు విడిచిపోరాదు ఈ బాస చేసి ఇక నిండునూరేళ్ళు - ఈ సతికి నీడవై నిలిచి కాపాడు కోరస్: మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠేబద్నామి శుభగేత్వం జీవం శరదశ్శతమ్ అతడు: నా జీవితానికే అధారము అయి నిన్నుఅల్లింది ఈ దారము నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము కోరస్: మంత్రాలు అతడు: ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివినించి చూసి ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్యరాజ్యాన్ని ఏలమంటోంది

Aahwanam : Devathalaara Randi Song Lyrics (దేవతలారా రండి)

చిత్రం : ఆహ్వానం (1997 )

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి



పల్లవి  :

దేవతలారా రండి మీ దీవెనలందించండీ నోచిన నోములు పండించే నా తోడును పంపించండీ కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ కనివిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండీ కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ కనివిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండీ

చరణం 1 :

ఓ... శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి మా ముంగిలిలోన పున్నమి పూలవెన్నెల విరియాలి మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి

చరణం 2:

ఆ... తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళతెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోట నిధినిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట

Aahwanam : Manasa Na Manasa Song Lyrics (మనసా...నా మనసా మాటాడమ్మా.)

చిత్రం : ఆహ్వానం (1997 )

గానం: కె.యస్.చిత్ర

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి



పల్లవి:

మనసా...నా మనసా మాటాడమ్మా... ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా... మనసా...నా మనసా మాటాడమ్మా... ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా... మనసా...నా మనసా మాటాడమ్మా... చరణం:1

చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో విన్నా నీ అనురాగపు తేనె పాటనీ.... మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో చూశా నీతో సాగే పూలబాటనీ... నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం నేను అన్న మాటకింక అర్థం నీవంటూ.... మనసా నా మనసా మాటాడమ్మా..... చరణం:2

తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా... అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా... తనువు మనసు ప్రాణం నీవైన రోజున నాదని వేరే ఏదీ మిగిలి లేదుగా... ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనుకా ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ.... మనసా...మాటాడమ్మా.... ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా.... మనసా....నా మనసా......


1, ఆగస్టు 2021, ఆదివారం

Aahwanam : Pandiri Vesina Akasaniki Song Lyrics (పందిరివేసిన ఆకాశానికి )

చిత్రం: ఆహ్వానం (1997 ) సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి  :

పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం

చరణం 1 :

ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం

చరణం 2 :

చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళకు విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి