చిత్రం: స్వయంవరం (1982)
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: సత్యం
పల్లవి: ముసుగేసిన మబ్బులలో మసకేసిన పరదాలలో దాగి దాగిన జాబిల్లి ఒకసారి నువ్వు రావాలి ఒక మాట నే చెప్పాలి నీతో మాట చెప్పి పోవాలి అహ హా ఆ... అహ హా ఆ... చరణం: 1 ఏ హృదయం నిను మార్చిందో మనసు మార్చుకున్నావు ఏ విధి నాపై పగబట్టిందో తెరలు తెంచుకున్నావు అవధులు లేని అనురాగానికి అనుమానం పొగ మంచుఅని మంచు కరిగిన మరు నిమిషంలో అనురాగం ఒక కోవెలని తెలియక తొందర పడ్డావు... తెలియక తొందర పడ్డావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఒకసారి నువ్వు రావాలి ఒక మాట నే చెప్పాలి నీతో మాట చెప్పి పోవాలి చరణం: 2 ఏ రాహువు నిను మింగిందో కను మరుగై పోయావు ఏ గ్రహణం నిను పట్టిందో నను దూరం చేశావు వెన్నెల కురిసే ఆకాశంలో అమావాస్య ఒక నల్లమబ్బని మబ్బు తొలగిన మారునిమిషంలో వెన్నెలదే అకాశమని తెలియక తొందర పడ్డావు... తెలియక తొందర పడ్డావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఒకసారి నువ్వు రావాలి ఒక మాట నే చెప్పాలి నీతో మాట చెప్పి పోవాలి