చిత్రం: రాజా విక్రమార్క (1990)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం:రాజ్-కోటి
గగన కిరణ గమనమిది భువన భవన చలనమిది చలిత లలిత కధనమిదే జతిని తెలుసుకో స్త్రీ రాగం పాడే శృంగార క్షణాల్లో శ్రీ శ్రీ లో రేగే కవితాగ్ని కణాల్లో డేలా నేనే జ్వాలా చినవాడికే చిరాకా? పరువానికే పరాకా? పిలిచేనులే ప్రియాంకా మది నే మయూరికా విధితో సమరం (గతం గమకం) చెలితో సరసం (శుభం సుముఖం ) శృతిలో కలిపి లయలో నడిచా జరిపే నటనం (కథం చలనం) జరిగే ఘటనం (అసం భరితం) మొదటే తెలిసీ జతగా కలిశా ఎదురైతే సవాలూ ఎదురొచ్చే శివాలూ పడతాలే భరతాలెన్నో నీకూ పుడతాయి సరదాలెన్నో నాకూ నేల మీద నంది లేచి నెత్తి మీద గంగ దించి నాగరాగమందుకున్న ఆటమీద పాటమీద సాటీ పోటీ నేనే తగిలే పవనం (సుఖం పరువం) రగిలే జవనం (క్షణం చలితం) కలగా వెలిగీ కసితో కలిశా అటు ఓ విరహం (చిరం అచిరం) ఇటు ఓ కలహం (వరం సుచిరం) సుడులే తిరిగీ పిడుగై కదిలా మాయల్లో మజాలు మబ్బుల్లో జలాలు కెరటాలై పొంగే దాకా ఆగు గిరి చాటు కిన్నెరసాని వాగు కంచి కాడ తుంగభద్ర సొంపు చూడు వీరభద్ర జాజి వీణ తీగ మీటి జావళీలు పాడుకున్నా నాట్యం తీరం చూస్తా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి