చిత్రం: రాజా విక్రమార్క (1990)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం:రాజ్-కోటి
ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా.. ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా.. ఏలేలో.. ఏలేలో.. కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఎంకి పాట పాడుకుంటూ ఎన్నెలంతా పంచుకుంటు గోరింట పండేటి వాలింటి పొద్దుల్లో నీ జంట నేనుంటె కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహో.. ఏలేలో.. ఏలోఏలో.. ఎదలోకి జరుగు పొదరింట కరుగు నే ముట్టుకున్న నా ముద్దబంతి ముద్దుకే జల్లెడ చినవాడి పొగరు చిగురాకు వగరు లోగుట్టులాగ నే తట్టుకుంట సాగిపో చంద్రుడా పచ్చంగా మెరిసేటి నీకళ్ళు రామ చిలకమ్మ గారాల పుట్టిళ్ళు గారంగ పట్టేటి కౌగిళ్ళు కన్నె వలపమ్మ నాట్యాల నట్టిళ్ళూ విరబుసిన పులకింతల పందిట్లొ ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా.. ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా.. కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహోయ్ హోలా.. హోలా.. హోలా.. హోలా.. పెదవింత కొరుకు మధువింత దొరుకు చిన్నోళ్ళ జంట వెయ్యేళ్ళ పంట వెన్నలో మీగడ తొలి సిగ్గు చెరిపే చలి ముగ్గులెరుపు మా ప్రేమ తంటా నీకెందుకంటా వెళ్ళిపో సుర్యుడా మూగేటి చీకట్ల మేఘాలు నన్ను తాకేటి నీ ప్రేమ దాహాలు అలిగేటి నీ కంటి దీపాలు ముద్దులడిగేటి నీ కన్నె తాపాలు ముసి నవ్వుల ముఖ వీణల ముంగిట్లొ ఏలేలో.. ఏలేలో.. ఏలేలేలేలో.. ఓలా.. ఏలేలో.. ఏలేలో.. ఏలోఏలోఏలో.. ఓలా.. కొండ కోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మా పేరంటాలే వచ్చేనంట ఓహో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి