చిత్రం: అతిధి (2007)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: దీపు, ఉష
సంగీతం: మణి శర్మ
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా రెప్పల దుప్పటీ కమ్మేచీకటీ చూపించిన ఏ కాంతికైనా
నిను నీవే సారిగా కణాలేవీ మనసా నడిరాతిరి నాదాకా కడతేరాడు తెలుసా
ఏవో జ్ఞాపకాలు సుడి దాటి బయటపడలేవా ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చంద్రుడి ఎదలో మంటనీ వెన్నెల అనుకుంటారనీ
నిజమైన నమ్మేస్తామా భ్రమలో పదమా తెలిసీ జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమె విడిచీ
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా ప్రాణం ఉనికిపైన అనుమాన పదారు ఎపుడైనా
నిను నీవే సారిగా కణాలేవీ మనసా నడిరాతిరి నాదాకా కడతేరాడు తెలుసా పోయింది వెతికే వేదనా ఉండుండీ ఎదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకీ అలజడి నిలిచేదెపుడూ సందేహం కలిగే మడికీ కలతని తీర్చేదెవరూ
శాపం లాగ వెంట పడుతున్న గతం ఏదైనా దీపం లాగా తగిన దారేదో చూపగలిగేనా
నిను నీవే సారిగా కణాలేవీ మనసా నడిరాతిరి నాదాకా కడతేరాడు తెలుసా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి