ఎరుపు రంగు యెడ ఉంటే
ఆడే ఉంటా-నంటివి
అడవి తల్లికి కన్న తల్లికి
కన్ను రెప్పవైతివి
నెత్తురు పత్థఇల్లుగా
ఏ నేల మీద పడి ఉంటివి
నెత్తురు పత్థఇల్లుగా
ఏ నేల మీద పడి ఉంటివి
ఓ... ఓ... ఓ.ఓ.
ఉద్యమం ఎలా బాలుడా.
వీరుడా అభిమన్యుడా
ఉద్యమం ఎలా బాలుడా
వీరుడా అభిమన్యుడుఆడి పాడే వయసులో
ఏ పాడు కడుపునా పుట్టినావు
బిడ్డ ఉన్న బిడ్డ లేని
గొడ్డు రాలిని చేసినావు
అమ్మనయ్యా నీకు-నేనను
నిమిషంలో.
కన్నుమిస్తివి
ఓ... ఓ... ఓ
ఉద్యమం ఎలా బాలుడా.
వీరుడా అభిమన్యుడు
ఉద్యమం ఎలా బాలుడా
వీరుడా అభిమన్యుడుతల్లి పాలను తప్పలేదు
ఒడిలో నిన్ను ఊపలేదు
చందమామను చూపిపాడే
లాలి పాటలు పాడలేదు
పట్టెడన్నం పెట్టకున్న
మట్టి వేసి
కప్పుతున్న
ఓ... ఓ... ఓ
ఉద్యమం ఎలా బాలుడా.
వీరుడా అభిమన్యుడు
ఉద్యమం ఎలా బాలుడా
వీరుడా అభిమన్యుడు
ఎర్ర జండాలో చూసుకుంటే
ఎర్రని జండాలో చూసుకుంటా
వేడి నెత్థుటి ఎరుపు లో
నీ జాడలే కనిపించునంటే
కత్త్తి-తోనే కడుపుపైన ఆణువణువూ.
కోసుకుంటే
ఓ... ఓ... ఓ…
ఉద్యమం ఎలా బాలుడా.
వీరుడా అభిమన్యుడు
ఉద్యమం ఎలా బాలుడా
వీరుడా అభిమన్యుడు
ఉద్యమం ఎలా బాలుడా
వీరుడా అభిమన్యుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి