చిత్రం : శుభోదయం (1980)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
పల్లవి:
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా
చరణం 1:
త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాది బొమ్మా
రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది బొమ్మా
మువ్వ గోపాల మువ్వ గోపాల మువ్వ గోపాల అన్నట్టుందమ్మా
అడుగుల సవ్వళ్ళు కావమ్మ అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
చరణం 2:
రాసలీలా సాగినాక రాకనీవే నమ్మ
రాతిరేల కంట నిదుర రాదమ్మ
ముసిరినా చీకటి ముంగిట వేచింది బొమ్మా
ముద్దు మురిపాల మువ్వ గోపాల నువ్వు రావేలా అన్నట్టుందమ్మా
మనసు దోసుకున్న ఓయమ్మా నీ మనసు దాసుకోకు బుల్లెమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి