15, జనవరి 2022, శనివారం

Sri Ramulayya : Karma Bhoomilo Song Lyrics (కర్మభూమిలో)

చిత్రం: శ్రీ రాములయ్య (1999)

సాహిత్యం: కలేకూరి ప్రసాద్‌

గానం: జేసుదాస్

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్


కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసీ విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో సమిధై పోయావా ... ! పారాణింకా ఆరనెలేదు తోరణాల కళ వాడనెలెదు పెండ్లి పందిరీ తీయనెలేదు బంధువు లిండ్లకు చేరనెలేదు మంగళనాదాలాగనెలేదు అప్పగింతలు అవ్వనెలేదు . . . . . గల గల పారే ఓ సెలయేరా పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికే కాపురమెళ్ళావా . . .! మానవత్వమే మంట గలిసెనా మమతలకర్ధం లేకపోయెనా వేదగోష ఎగతాళి చేసెనా ప్రమాణాలు పరిహాసమాడెనా ప్రేమబంధముగ కట్టిన తాళి ఉరితాడయ్యి కాటు వేసెనా . . . పున్నమి రువ్విన వెన్నెల నవ్వా కారు మేఘములు కమ్మేశాయా చీకటి చితిలో శవానివై నావా . . . ! రాక్షస విలువలు రాజ్యమేలెడి నరకప్రాయపు సంఘంలోన మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్లోన సరుకులాయెనే ఆడపడుచులే శతృవులైరా అత్త కన్నులే నిప్పులు చెరిగెనా . . . .కళ కళలాడిన ఓ నవ వధువా శిశిరం నిన్ను కబళించిందా మలమల మాడిన బొగ్గయి పోయావా . . .! ఆడదికన్నా అడవిలో మానుకై విలువిచ్చేటీ దేశంలోన ఆరడి పెట్టిన ఆడపడుచుకూ అత్తారింట తప్పని స్థితి యిది బ్రతుకున నిప్పుల పోసిన అత్తకూ గర్భశోకమూ తప్పకున్నది పిశాచ గుణాల ఆనందానికి మారణహోమం జరుగుతున్నది . . ..... లేళ్ళను చంపే పులుల సీమలో కోకిల మేధం సాగుతున్నది జీవనరాగం ఆర్తనాదమాయె . . .! ఎవరొస్తారని ఎదురుచూపులు ఏం చేస్తారని ఈ పడిగాపులు విషం యిచ్చినా తగుల బెట్టినా ఉరితాడుకు బిగదీసి చంపినా ఏ డాక్టర్ నీకై సాక్ష్యం రాడు కోర్టులు నీకు రక్షణ రావు . . . చట్టాలన్నీ , కోర్టులు అన్నీ నేతి బీరలో నేయి చందమే సామాన్యులకవి ఎండమావులేనా . . .? అక్కలారా ఓ చెల్లెల్లార వ్వవస్థ మలచిన అబలల్లార కాలే గుండెల కమురువాసనకు కన్నులు ఏరులు పారుతున్నవా దారి పొడవునా శవాల గుట్టలు గుండెన గాయం కెలుకుతున్నవా . . . . . రాక్షస పీడన నెదిరించాలె స్ర్తీలు పురుషులు మనుషులందరూ సమానమన్న సమాజ ముండాలే . . . కర్మభూమిలో పూసిన ఓ పువ్వా . . . .కన్నుల మంకెన పువ్వులు పూయగా నెత్తురు మంటలు కేతనమవ్వగ సమర హోరులో ముందుండాలమ్మా . . . . !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి