చిత్రం: పండంటి కాపురం (1972)
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు.ఊ. కావాలి ముందు ముందు పొదరిల్లు. పొదరిల్లు ఊ. ఊ. ఊ. ఓ. ఓహోహో. ఆహహా. ఈనాడు కట్టుకున్న. బొమ్మరిల్లు.ఊ. కావాలి ముందు ముందు పొదరిల్లు. పొదరిల్లు ఆశలే తీవెలుగా ఉహూ. ఊసులే పూవులుగా ఉహూ. వలపులే తావులుగా. అలరారు ఆ పొదరిల్లు ఆ.ఆ.ఆ. ఆశలే తీవెలుగా ఉహూ. ఊసులే పూవులుగా ఉహూ. వలపులే తావులుగా. అలరారు ఆ పొదరిల్లు పగలైనా రేయైనా. ఏ ఋతువులోనైనా పగలైనా రేయైనా. ఏ ఋతువులోనైనా కురిపించును తేనెజల్లు. పరువాల ఆ పొదరిల్లు ఈనాడు కట్టుకున్న. బొమ్మరిల్లు.ఊ. కావాలి ముందు ముందు పొదరిల్లు. పొదరిల్లు కళ్ళలో కళ్ళుంచీ ఉహూ. కాలమే కరిగించే ఉహూ. అనురాగం పండించే. ఆ బ్రతుకే హరివిల్లు ఆ.ఆ.ఆ. కళ్ళలో కళ్ళుంచీ ఉహూ. కాలమే కరిగించే ఉహూ. అనురాగం పండించే. ఆ బ్రతుకే హరివిల్లు నా దేవివి నీవైతే. నీ స్వామిని నేనైతే నా దేవివి నీవైతే. నీ స్వామిని నేనైతే పచ్చని మన కాపురమే. పరిమళాలు వెదజల్లు ఈనాడు కట్టుకున్న. బొమ్మరిల్లు.ఊ. కావాలి ముందు ముందు పొదరిల్లు. పొదరిల్లు ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి