చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా... నీ బుగ్గ నా మొగ్గ నడిమధ్య ఎవరడ్డు ఛీ పోలా తీపి కోపాలా.. ఛీ పోలా తీపి కోపాలా... కాదన్న ముద్దియ్యీ కన్యామణి, సిగ్గన్న ముద్దే ఈ కాంతామణి ఏమన్న అనకున్న రేపన్న మాపన్న ఇద్దరికి తప్పుదులే ఈ కౌగిలి... ఓయ్ ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా... ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా... వంగతోట కాడ నువ్వు వొంగుతుంటే పైటకొంగు నిలవలేక జారుతుంటే ఓలాల. ఓలాల.. ఓలాల... ఓలాల.... పైరేమి చూస్తావు చేనులోనా ఈ పంట చూడు పిల్లగో చెంగులోనా ఓయ్ నీ పిక్క బలుపు చూస్త నీ రెక్క నులుపు చూస్తా నా కన్నె తలుపు తీస్త నీకున్న ఉడుకు చూస్తా సింగారం చిగురందం వయ్యారం వడి ఆందం అన్నిటికీ తప్పదులే ఆ ఎంగిలీ ఓలాల వచ్చి వాలాలా. ఓలాల ఓలాల వచ్చి వాలాలా.. ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా... మెరక మీద నువ్వు అరక దున్నుతుంటే నీ కుచ్చుపాగ గుండేలోన గుచ్చుకుంటే ఓలాల. ఓలాల.. ఓలాల... ఓలాల.... పాగనేమి చూస్తావె పడుచుదాన నా నాగలుంది చూడవే పదునులోనా నీ ఒడ్డూ పొడుగు చూస్తా.. నా వొల్లే మరచి పోతా... నీ ఒంపే ఒలకబోస్తె.. నీ ఒల్లో మంచమేస్తా... శ్రీకారం సిగ్గందం.. మందారం బుగ్గందం... ముచ్చటగా తప్పదులే ముద్దెంగిలి... ఓలాల వచ్చి వాలాలా.. ఓలాల వచ్చి వాలాలా... ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు ఓలాల వచ్చి వాలాలా.. నీ బుగ్గ నా మొగ్గ నడిమధ్య ఎవరడ్డు ఛీ పోలా తీపి కోపాలా.. ఓలాల వచ్చి వాలాలా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి