17, ఫిబ్రవరి 2022, గురువారం

Saptapadi : Akkilandeswari Song Lyrics (అఖిలాండేశ్వరి... )

చిత్రం: సప్తపది (1981)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కె వి మహదేవన్



పల్లవి: 

ఓంకార పంజర శుకీమ్... ఉపనిష దుద్యాన కేళికల కంఠీమ్..  ఆగమ విపిన మయూరీ ఆర్యాం..అంతర్విభావ యేత్ గౌరీమ్!!   అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి... పాలయమాం గౌరీ  పరిపాలయమాం... గౌరి 

పరిపాలయమాం... గౌరి  శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి  ఆ...శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి...  సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి.. 

చంద్రప్రభా ధవళకీర్తి.. చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్బశాంతర భువనపాలిని  కుంకుమరాగశోభిని కుసుమ బాణ సంశోభిని  మౌనసుహాసిని... గానవినోదిని.. భగవతి పార్వతి... దేవీ  అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి.. పాలయమాం గౌరీ  పరిపాలయమాం గౌరి

చరణం 1: 

శ్రీహరి ప్రణయాంబురాసి.. శ్రీపాద విచలిత క్షీరాంబురాసి 

శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని 

శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి.. ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి 

ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి.. ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి

ఆదిలక్ష్మి.. విద్యాలక్ష్మి.. గజలక్ష్మి.. సంతానలక్ష్మి  సకలభోగసౌభాగ్యలక్ష్మి... శ్రీమహాలక్ష్మి... దేవీ...  అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి... పాలయమాం గౌరీ  పరిపాలయమాం ..గౌరి

చరణం 2: 

ఇందువదనే ..కుందరదనే ..వీణాపుస్తకధారినే 

ఇందువదనే ..కుందరదనే ..వీణాపుస్తకధారినే  శుకశౌనకాది ..వ్యాసవాల్మీకి ..మునిజన పూజిత శుభచరణే  శుకశౌనకాది ..వ్యాసవాల్మీకి ..మునిజన పూజిత శుభచరణే  సరససాహిత్య... స్వరస సంగీత.. స్తనయుగళే   సరససాహిత్య... స్వరస సంగీత.. స్తనయుగళే వరదేఅక్షరరూపిణే ....శారదే దేవీ  అఖిలాండేశ్వరి .. చాముండేశ్వరి... పాలయమాం గౌరీ  పరిపాలయమాం ..గౌరి

చరణం 3: 

వింధ్యాతటీవాసినే... యోగసంధ్యాసముద్భాసినే  సింహాసనస్తాయినే.. దుష్టహరరంహక్రియాశాలినే  విష్ణుప్రియే.. సర్వలోకప్రియే .. సర్వనామప్రియే .. ధర్మసమరప్రియే..  హే.. బ్రహ్మచారిణే... దుష్కర్మవారిణే..  హే.. విలంబితకేశపాశినే....  మహిషమర్దనశీల.. మహితగర్జనలోల..  భయతనర్తనకేళికే... కాళికే..  దుర్గమాగమదుర్గ పాహినే... దుర్గే దేవీ.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి