17, ఫిబ్రవరి 2022, గురువారం

Saptapadi : Repaliya Eda Song Lyrics (రేపల్లియ యెద)

చిత్రం: సప్తపది (1981)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కె వి మహదేవన్




రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి జీవనరాగమై బృందావన గీతమై కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగాన లోలుని మురుపించిన రవళి నటనల సరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి