చిత్రం: వసంత కోకిల (1982)
రచన: రాజశ్రీ
గానం: జేసుదాస్
సంగీతం: ఇళయరాజా
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని మోసం తెలియని లోకం మనది | తియ్యగ సాగే రాగం మనది ఎందుకు కలిపాడో | బొమ్మలను నడిపే వాడెవడో నీకు నాకు సరి జోడని | కలలోనైనా విడరాదనీ... కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో కారడవులలో కనిపించావు | నా మనసేమో కదిలించావు గుడిలో పూజారై | నా హృదయం నీకై పరిచాను ఈ అనుబంధమేజన్మది | వుంటే చాలు నీ సన్నిధి కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి