చిత్రం: యమగోల (1977)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా హా... చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా. అహ . రాటుతేలిపోయావు. నీటుగాడా . అహహహ రాటి తేలిపోయావు నీటుగాడా. నీ నాటు సరసం చాలులే పోటుగాడా హేయ్ చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా మాపటేళా ఆకలేసి .హా.మంచెకాడ కౌగిలిస్తే.హా. అబ్బా. నీ సోకుమాడా.అబ్బో. ఓయబ్బో. దబ్బపండంటిదానా . అమ్మో. ఓలమ్మో. జబ్బాల నునుపు చూడ వేడెక్కి .డీడిక్కి అంటుందిలే... అమ్మమ్మ. అల్లిబిల్లి తీగలల్లే. అల్లుకుంటే. ఝల్లుమంటే. ఊరి పొలిమేరకాడా. అయ్యో.ఓరయ్యో. ఊరించుకళ్ళలోనా. అమ్మో. ఓలమ్మో. కవ్వించు నీలి నీడ. కైపెక్కి. తైతక్కలాడిందిలే.ఏ. ఏ ... అహహహా. చిలక కొట్టుడు కొడితే. చిన్నదనా. పలక మారి పోతావే పడుచుదానా. అహ .రాటుతేలిపోయావు. నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా వలపు వాగు పొంగుతుంటే.హా. వాడి చూపు వంతెనేసి. హో. వలపు వాగు పొంగుతుంటే.హా. వాడి చూపు వంతెనేసి. హో. సపంగి చెట్టు కాడా. అయ్యో. ఓరయ్యో. ఒంపుల్ల సొంపులాడ . అమ్మో. ఓలమ్మో. చెంపల్లో కెంపులన్ని. ముద్దిచ్చి. మూటగట్టుకో అరెరెరె. కోరికంతా కోక చుట్టి. కొంగులోనా పొంగు దాచి కోరికంతా కోక చుట్టి. కొంగులోనా పొంగు దాచి ముంత మామిడి గున్న. అమ్మో. ఓలమ్మో రమణీ ముద్దుల గుమ్మ . అమ్మో. అమ్మమ్మో విరబూసి నవ్వింది. నవ్వులన్ని పువ్వులెట్టుకో. ఓ ఓ ఓ. హోయ్ హాయ్.చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా అహ .రాటుతేలిపోయావు. నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి