చిత్రం: జీన్స్ (1998)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ రచన: AM. రత్నం, శివ గణేష్ గాయని: నిత్యశ్రీ మహదేవన్ కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా? కనులకు సొంతమౌనా? కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు జలజల జలజల జంట పదాలు గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే రేయీపగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే క్రౌంచపక్షులు జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవు వీడిమనలేవు కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదేడ్చును పొంగేనా ప్రేమే చిందేనా? ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం తాళికొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి