25, డిసెంబర్ 2023, సోమవారం

Sahasa Veerudu Sagara Kanya : Srinadhuni Kavithaloni Song Lyrics (శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది)

చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




పల్లవి: శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డులాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే చాంగురే చాంగు చాంగురే వాత్సాయన శాస్త్రమంత వడబోసిన అందగాడు వేసినాడు కోరచూపు బాణం బాపురే ఎంత ఊపురే బాపురే ఎంత ఊపురే రేగుతోంది కొంటె కోరిక ఆగమంటే ఆగలేనిక హాయమ్మా... రేయి కలయిక చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే చరణం:1 జుం తజుం తకజుం చిరునగవులొలుకే ప్రియభామిని ప్రేమాయణం.... జం నిజం జగజం చలిచలిగ కలుపు చెలి సోకుల పారాయణం పైట తెలిపెనే వయసు అవసరం బయటకెందుకా వివరం ఇయ్యవే ఒడి లాంఛనం కసి కాంచనం ఇక అసలు సిసలు రుచులు మరిగి ఆనందం అంతు తెలియగా... చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డులాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే చరణం:2 సై గురు ఫిగరు కిలకిలల ఎగిసే కేరింతలు పూబంతులు స్లో ఛలో పొదలో కసికసిగా ముసిరే ఝుం ఝుమ్మను కవ్వింతలో... పుంజుకోయిలా పుంజు కోకిల రంజు చేయనా లలనా.... సాగనీ రసబంధనం నవ శోభనం సరిగమలు పలుక మధన చిలుక మైకంలో ప్రేమ చిలకగా... చాంగురే చాంగు చాంగురే చాంగురే చాంగు చాంగురే శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డులాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి