24, మార్చి 2024, ఆదివారం

Aahwanam : Aakasam Pandiri Vesindi Song Lyrics (ఆకాశం పందిరి వేసింది)

చిత్రం : ఆహ్వానం (1997 )

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి



పల్లవి  :

ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి అతడు: మంగళవాద్యాలు పిలుపును అందించగ ముంగిట మురిపాలు కళకళలాడగ ఆమె: పచ్చగ పెళ్ళయే ముహూర్తమె తథాస్తంది అతడు: ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది కోరస్: ఆ సువ్వి ఆహా సువ్వి ఆ సువ్వి ఆహా సువ్వి చరణం : 1 నలుగురూ చేరి నలుగుపెట్టరే చిన్నారికి జలకాలాడించరే ముద్దుగా ముస్తాబును చెయ్యరే బుగ్గమీద పెళ్ళిచుక్క దిద్దరే అతడు: వరుడితొ మగపెళ్ళివారు కోరస్: తయ్యారు అతడు: విడిదికి వియ్యాలవారు కోరస్: వచ్చారు అతడు: మనవిని మన్నించి మనువుకి రండయ్యా పప్పన్నం పెడతాం దయచేయండయ్యా అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా

ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి చరణం : 2 గౌరీపూజను చేసి కోరస్: చేసి ఆమె: నీ కోసం నోములు నోచి కోరస్: నోచి ఆమె: కులుకుల కాణాచి అదిగో వచ్చింది తెరవెనుకన వేచి కలలే కంటోంది పరిణయ ప్రమాణమే చేసి పొందమంటోంది

ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి చరణం : 2 పురోహితుడు: ధర్మేత్వయా యేశ నాతిచరితవ్యా కైకాల:||ధర్మే|| పురోహితుడు: అయ్య నాతిచరామి అనండి అతడు: నాతిచరామి పురోహితుడు: అర్థేత్వయా యేశ నాతిచరితవ్యా కైకాల:||అర్థే|| అతడు: నాతిచరామి పురోహితుడు: కామేత్వయా యేశ నాతిచరితవ్యా కైకాల:||కామే|| అతడు: నాతిచరామి కైకాల: అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారుగాని మరి వాటికి అర్థాలు తెలియాలి కదండీ చెబుతారా? అతడు: అలాగే ధర్మార్థకామములలోన ఏనాడూ - ఈమె తోడుని నీవు విడిచిపోరాదు ఈ బాస చేసి ఇక నిండునూరేళ్ళు - ఈ సతికి నీడవై నిలిచి కాపాడు కోరస్: మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠేబద్నామి శుభగేత్వం జీవం శరదశ్శతమ్ అతడు: నా జీవితానికే అధారము అయి నిన్నుఅల్లింది ఈ దారము నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము కోరస్: మంత్రాలు అతడు: ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివినించి చూసి ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్యరాజ్యాన్ని ఏలమంటోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి