చిత్రం: దొంగ దొంగ (1993)
రచన: రాజశ్రీ
గానం: సుజాత మోహన్
సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్
పల్లవి: తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని చరణం 1: ఉరికే నా కులుకే.. కొంటె తలపులు పలికెనులే నా పాల వన్నెలే.. కన్నెవలపులు చిలికెనులే సందేళ అందాల వంపులలో.. పరువము పంచేనా నాజూకు నా చూపు చురకలలో.. చుక్కలను చూపేనా సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం చరణం 2: జతగా.. కలిసి.. జంట గువ్వలల్లె ఎగిరిపోదాం గాలిలో.. తేలి.. నీలి గగనము ఏలుకుందాం వినువీధి జాబిలితో ఆడుకుందాం.. వెన్నెలను పంచుకుందాం స్వర్గాల తీరాలు చేరుకుందాం.. తనువులు మరిచిపోదాం సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి