Donga Donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Donga Donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మార్చి 2024, శనివారం

Donga Donga: Etilona Chepallanta Song Lyrics (ఏ.. ఏటిలోన సేపలంట )

చిత్రం: దొంగ దొంగ (1993)

రచన: రాజశ్రీ

గానం:శ్రీనివాస్, సురేష్ పీటర్స్

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్



ఏ.. ఏటిలోన సేపలంట హైలెస్సా... హైలెస్సా... అరె' ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా... హైలెస్సా... ఏ.. ఏటిలోన సేపలంట హైలెస్సా... హైలెస్సా... అరె' ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా... హైలెస్సా... మీసమున్న రొయ్యలంట హైలెస్సా... హైలెస్సా... పాలరంగు పరిగెలంట హైలెస్సా... హైలెస్సా... కట్టుకున్న ఇంటిదాన్ని వండమను హైలెస్సా... మాపటేళ నీ ఇంట పండగను హైలెస్సా... కట్టుకున్న ఇంటిదాన్ని వండమను హైలెస్సా... మాపటేళ నీ ఇంట పండగను హైలెస్సా... ఏ.. ఏటిలోన సేపలంట హైలెస్సా... హైలెస్సా... అరె' ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా... హైలెస్సా...


Donga Donga : Sitaalu Song Lyrics (సీతాలు నువ్వు లేక నేను లేనే)

చిత్రం: దొంగ దొంగ (1993)

రచన: రాజశ్రీ

గానం: షాహుల్ హమీద్

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్



పల్లవి:

సీతాలు నువ్వు లేక నేను లేనే ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే ఆ కబురూ చేరే లోగా చేరు నన్నే సీతాలూ నువ్వు లేక నేను లేనే చరణం 1: సందేపొద్దు ముద్దరాలు జాజిపూలు కోయు వేళా పూలు కోయలేదె మనసే కోసెనంట పెళ్ళి చీరా పసుపు నీటా పిండారవేయు వేళ మనసు పడిన వాడి మనసే పిండెనంట గడ్డివాము చాటులోన బాస చేసి కూడా పోయేవే పోయేవు పోయేవులే ప్రేమ తీసి గట్టు నెట్టి నీ చీర చెంగు లోనె కన్నీళ్ళు మూట గట్టి పోయేవే పోయేవు పోయేవు లే కోరుకున్న తోడు వీడీ ఇచ్చిన మల్లెలన్ని నట్టేట ఇసిరేసి నన్ను కన్నీటి వాగులోన అల చేసి   ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట సీతాలు నువ్వు లేక నేను లేనే ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే ఆ కబురు చేరే లోగా చేరు నన్నే సీతాలు నువ్వు లేక నేను లేనే ఓ ఓ ఓ ఓ చరణం 2: బొట్టునీకు పెట్టినా వేలి రంగు ఆరలేదే పూసుకున్న చందనాల వాసనింకా తగ్గలేదే గాజువాకలోన కొన్న గాజులింక వెయ్యలేదే పెళ్ళి పంచెకంటుకున్న పసుపు వన్నె మాయలేదే కళ్యాణ బుగ్గ చుక్క కళ్ళార చూసేది ఎప్పుడమ్మా మల్లెల పక్కమిద బంతులాట ఎప్పుడమ్మ నీ కంటి కొనసూపు కొసరి రువ్వేది ఎప్పుడమ్మ సీకటి ఎలుగులోన సిందులాట ఎప్పుడమ్మ ఎలమావి తోటలోనా ఏకాకి గోరువంక శృతి మారి కుసేనమ్మ జతకొసం వేచేనమ్మ   ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట సీతాలు నువ్వు లేక నేను లేనే ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే ఎళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే ఆ కబురు చేరే లోగా చేరు నన్నే సీతాలు నువ్వు లేక నేను లేనే ఓ ఓ ఓ ఓ ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే

Donga Donga : Koncham Neeru Koncham Nippu Song Lyrics ( కొంచం నీరు కొంచం నిప్పు)

చిత్రం: దొంగ దొంగ (1993)

రచన: రాజశ్రీ

గానం: అనుపమ

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్



పల్లవి:

కొంచం నీరు కొంచం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచం గరళం కొంచం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన కొంచం నరకం కొంచం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ కొంచం నీరు కొంచం నిప్పు ఉన్నాయి నా మేనిలోన

చరణం 1: నా కలలో ఎవరో ఒచ్చే నా కనుల వెలుగై నిలిచే ఓ స్వాతి చినుకై కురిసే అహ నా మదిలో మెరుపై మెరిసే ఈ పెదవి విరి తేనె మడుగంట అహ నా వగలే దరి లేని వగలంట నేడు ఈ భూమికే నీ కోసం దిగివచ్చే ఈ తార తోడుగ వస్తే మురిపాలు తీరేరా కాలాలు వడగేస్తే బంగారం ఈ వన్నె నీ ఓర చూపుల్లో వరహాలే ఒలికెనే నీ నవ్వుల పువ్వుల్లో ముత్యాలే దొరికెనే ఊరించే వంపుల్లో హరివిల్లే విరిసేనే కొంచం నీరు కొంచం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచం గరళం కొంచం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన కొంచం నరకం కొంచం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ

చరణం 2: మనసైన నీ వాడు వినువీధిన వస్తాడే అందాలకు బహుమతిగా సిరివెన్నెలనిస్తాడే కొంచం నీరు కొంచం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచం గరళం కొంచం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన కొంచం నరకం కొంచం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ చంద్రలేఖ

Donga Donga : Thee theyani Song Lyrics (తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం)

చిత్రం: దొంగ దొంగ (1993)

రచన: రాజశ్రీ

గానం: సుజాత మోహన్

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్



పల్లవి:     తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం     నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం     తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం     సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని     సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని చరణం 1:     ఉరికే నా కులుకే.. కొంటె తలపులు పలికెనులే     నా పాల వన్నెలే.. కన్నెవలపులు చిలికెనులే     సందేళ అందాల వంపులలో.. పరువము పంచేనా     నాజూకు నా చూపు చురకలలో.. చుక్కలను చూపేనా     సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని     సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని     తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం     నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం     తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం చరణం 2:     జతగా.. కలిసి.. జంట గువ్వలల్లె ఎగిరిపోదాం     గాలిలో.. తేలి.. నీలి గగనము ఏలుకుందాం     వినువీధి జాబిలితో ఆడుకుందాం.. వెన్నెలను పంచుకుందాం     స్వర్గాల తీరాలు చేరుకుందాం.. తనువులు మరిచిపోదాం     సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని     సొగసులు చిందులాడని.. వయసులు పొంగి రేగని     తీ.. తీ.. తీయని.. సెగలు నాకు అందం     నా.. నా.. నవ్వులా.. ఈల వేసె పరువం     తోడుగా చేరవా.. ఎందుకింక మౌనం

Donga Donga : Veera Bobbili Kotalo Song Lyrics (వీర బొబ్బిలి కోటలో)

చిత్రం: దొంగ దొంగ (1993)

రచన: రాజశ్రీ

గానం: కె.ఎస్.చిత్ర, ఉన్ని మీనన్, మనో

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్


పల్లవి :

ఓఓఓ..ఓఓ... వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్దర పోయే యేళ సద్దేమణిగిన రాతిరి యేళ అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది వీర బొబ్బిలి కోటలో ఎన్నెల కాసే యేళల్లో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెలసడి మీ మనసులు దోసిందా

చరణం : 1

వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి మీ ఆశలన్నీ అడిఆశలంట ఈ ఏలం పాట మీ ఊహల పంట నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది

చరణం : 2

ఇద్దరు సూరీలొచ్చిరమ్మా ఒంటరి తామర నలిగెనమ్మా కత్తుల బోనే స్వయంవరమే కలిగెను నాలో ఒక భయమే దమయంతిని నేనమ్మా నల మహారాజు ఎవరమ్మా మనసైన వాణ్ణి నేనమ్మా మహరాజును నేనే చిలకమ్మా ఇది పరవశం నాకు నా తనువున ఒణుకు వెలువడదే పలుకు తను ఎవరికి సొంతమో చెప్పాలంటే ఏం చెబుతుంది మూగప్రాయం నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా వీర బొబ్బిలి కోటలో మాటు మణిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంట వీర బొబ్బిలి కోటలో ఎన్నెల కాసే యేళల్లో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెలసడి మీ మనసులు దోసిందా వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్దర పోయే యేళ అందెల సడి నా మనసే దోసింది