చిత్రం: ఏవండీ ఆవిడ వచ్చింది (1993)
రచన: భువన చంద్ర
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: రాజ్-కోటి
పల్లవి:
గంగను చూస్తే గౌరికి మంట
గౌరిని చూస్తే గంగతో తంట
ఎట్టా చెప్పయ్య
బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య
నువ్వైనా... చెప్పయ్య
గంగను చూస్తే గౌరికి మంట
గౌరిని చూస్తే గంగతో తంట
ఎట్టా చెప్పయ్య
బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య
నువ్వైనా... చెప్పయ్య
చరణం:1
మమతను పంచె గౌరమ్మ తల్లి
శివుడిలో సగమయ్యా
అర్ద శరీరం తనదయ్యా
తలపై చల్లని గంగమ్మ లేక శివుడే లేడయ్యా
భవునికి తాపం తీరదయ్యా
తనువు ఒకరైతె మనసు ఇంకోకరు
బోమ్మ ఒకరైతె బోరుసు ఇంకోకరు
భామలేమో వేరయ్య ప్రేమ ఒక్కటేనయ్య
రుక్మిణికిస్తే భామకు కోపం భామకు
పెడితే రుక్మిణి తాపం తిరేదేట్టయ్య
బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య
నువ్వైనా... చెప్పయ్య...
చరణం:2
కొప్పులు రెండు ఓ చోట ఉంటే కొంపకు చేటయ్యా మధ్యల దరువే బెటరయ్యా సవతుల మధ్య పంతాలు పుడితే బతుకే బరువయ్యా నిప్పుల కుంపటి మేలయ్యా వింతలు గొలిపే ఇంతుల లీల ఇంటికి పోతే వంతుల గోల ఈడు దాటి పొయిన పోరు ఆగిపొదయ్య గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ఎట్టా చెప్పయ్యా బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య నువ్వైనా... చెప్పయ్య బ్రహ్మయ్యా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి