చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం : మణిశర్మ
రచయిత : వేటూరి
గానం : శంకర్ మహదేవన్
పల్లవి:
ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా
ఊరేలి చూపించు మహిమ
మా తోడు నీవయ్యా హనుమా మా హనుమా
మా గోడు గోరంత వినుమా
వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా
రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా
మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
చూపించరా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
వాయుపుత్రా హనుమా మావాడకొచ్చే హనుమా
రామ భక్త హనుమా మా రక్ష నీవే హనుమా
మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
చూపించరా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
నీనీడ చాలునయా
చరణం 1:
బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే
బాధలన్నీ తీర్చే దిక్కూ దైవం నీవేలే
చూసి రారా అంటేనే కాల్చి వచ్చావ్ మంటల్లే
జానకమ్మ కంట వెలిగే హారతీ నీవే
ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట
బ్రహ్మచారి మా బ్రహ్మవంట
సరిపాటి ఎవరంట
సాహొ ... మాసామీ నువ్వే హామీ యిస్తూంటే
రామబాణాలు కాపాడేనంట
ఓహొ మా జండాపైన అండై నువ్వుంటే
రామరాజ్యాలు మావే లెమ్మంట
మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
చూపించరా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
నీనీడ చాలునయా
చరణం 2:
మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనమ్మ ఆనందమంతా హనిమా నీ చరితంట పాహీ... శ్రీరామస్వామీ పల్లకి నువ్వంట నీకు బోయీలు మేమే లెమ్మంటా యాహీ .... ఆకాశాలైనా చాలని ఎత్తంట కోటి చుక్కల్లు తల్లో పూలంటా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి